ఆదిత్య కోసం తల్లిదండ్రులుగా మీరు కలిసి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలని డాక్టర్ యష్ వాళ్ళతో చెప్తుంది. అప్పుడే మా అమ్మానాన్న విడిపోయారు, మళ్ళీ వాళ్ళు కలవరేమో అనే డిప్రెషన్ నుంచి బయట పడతాడు. మీరు విడిపోయాక వేరే పెళ్లి చేసుకున్నారు మీ లైఫ్ డిస్ట్రబ్ అవుతుందని ఆలోచిస్తున్నారేమో తను కూడా ఒక డాక్టర్ కదా అర్థం చేసుకుంటుందని అంటుంది. ఇప్పటి వరకు యష్ పక్కన నిలబడితేనే పురుగును చూసినట్టు చూశారు కదా ఇప్పుడు దీన్ని ఎలా వాడుకుంటానో చూస్తా ఉండమని మాళవిక అనుకుంటుంది. కారులో యష్ పక్కన సీట్లో వేద కూర్చోబోతుంటే తనని ఆపి మాళవిక కూర్చుంటుంది. డాక్టర్ చెప్పింది కాబట్టి తనని ఎవరూ ఏమి అనరని ధైర్యంగా ఉంటుంది. వేద వెనుక సీట్లో కూర్చున్నందుకు చాలా బాధపడతాడు.
అభిమన్యు, నీలాంబరికి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు. పాల గ్లాసు పట్టుకుని నీలాంబరి సిగ్గుపడుతూ లోపలికి వస్తుంది. యష్ మాళవిక కారులో తన పక్క సీటులో కూర్చోవడంపై రగిలిపోతాడు.
Also Read: లాస్య ప్లాన్ చెడగొట్టిన రాజ్యలక్ష్మి- ప్రశాంతంగా అమ్మవారికి బోనం సమర్పించిన దివ్య
యష్: ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? నేను కారులో కూర్చున్న వెంటనే నువ్వు కదా నా పక్కన కూర్చోవాలి. తను కూర్చుంటే ఎందుకు మౌనంగా ఉన్నావ్
వేద: మాళవిక మీ పక్కన కూర్చుంటే నాకు మీకంటే ఎక్కువ కోపం, బాధ వచ్చాయి. వెనుక సీట్లో వెళ్ళి కూర్చోమని మొహం మీదే చెప్పాలని అనుకున్నా కానీ ఆదిత్య మొహంలో కనిపించిన చిన్న సంతృప్తి నన్ను ఆపేశాయి. ఆదిత్య దృష్టిలో మీరిద్దరూ తల్లిదండ్రులుగా ఉండాలి
యష్: ఆ మనిషి పక్కన కూర్చుంటే తేళ్ళు, జర్రులు పాకినట్టు అనిపించింది.
వేద: అసలు మాళవిక ఇంట్లో ఉండటమే ఇష్టం లేదు కానీ ఆదిత్య కోసం ఉండనిస్తున్నారు. మీరిద్దరూ గొడవ పడటం చూస్తే ఆదిత్య కండిషన్ సీరియస్ గా మారిపోతుంది. తను మనకి దక్కడు
యష్: అంతా అర్థం అవుతుంది అలాగే భయం కూడా వేస్తుంది. మాళవిక సంగతి నీకు తెలుసు ఏ పరిస్థితిని అయినా అనుకూలంగా మార్చుకుంటుందో నీకు తెలియదు. ఏ ఇబ్బందులు సృష్టింస్తుందో నీకు తెలియదు
Also Read: రేవతి ఆన్ ఫైర్- డైరీ అమ్మాయి ముకుందేనని కృష్ణ కనిపెట్టేస్తుందా?
వేద: ఏం ఇబ్బందులు సృష్టిస్తుంది. నా భార్య స్థానాన్ని లాగేసుకుంటుందా? తనంటే మీ మనసులో ఒక స్థానం ఉంది కదా ఇంకెందుకు భయం. నేను కూడా ఏమి ఆలోచించడం లేదు. మీరు కూడా అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండండి. ఈ విషయంలో నేనేమీ ఫీల్ అవడం లేదు.
ఎప్పుడెప్పుడు నీలాంబరిని సొంతం చేసుకుందామా అని అభిమన్యు ఆరాటపడతాడు. భార్యని దగ్గరకి తీసుకోబోతుంటే సిగ్గుపడుతుంది. దీంతో వెళ్ళి ఫస్ట్ నైట్ కదా అని సంబరపడుతూ అభిమన్యు లైట్ ఆపేస్తాడు. నీలాంబరి చంద్రముఖి అవతారం ఎత్తి ‘పారాయ్..’ అంటూ డాన్స్ మొదలుపెడుతుంది. అది చూసి అభి భయంతో వణికిపోతాడు.