బోనాలు ఎత్తడానికి వెళ్తునందుకు దివ్య చాలా సంతోషంగా ఉంటుంది. శోభనం జరగలేదని దివ్య మొగుడ్ని దెప్పి పొడుస్తుంది. మన శోభనం జరగడానికి అమ్మ శాంతి పూజ చేయిస్తుందని విక్రమ్ వెనకేసుకొస్తాడు. లాస్య దివ్యని టార్గెట్ చేసేలా మాట్లాడుతుంది. మీ అమ్మతో కలిసి బోనమెత్తుతున్నావని మురిసిపోకు. మీ ఇద్దరి మధ్య నేను ఉన్నాను. నీ బోనాల ఆశ నిరాశగా మిగులుస్తానని లాస్య హెచ్చరిస్తుంది. నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా అది జరగదని దివ్య గట్టిగానే సమాధానం ఇస్తుంది. తులసి వాళ్ళు గుడికి వస్తారు. వాళ్ళు వచ్చిన కాసేపటికే రాజ్యలక్ష్మి కుటుంబం కూడ వస్తుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా లాస్య ఎంట్రీ ఇస్తుంది. సంతానం కోసం దివ్యతో శాంతి పూజ చేయిస్తే మంచిదని పూజారి చెప్పారని రాజ్యలక్ష్మి చెప్తుంది. విక్రమ్, దివ్య సంతోషంగా గుడిలో ప్రదక్షిణలు చేస్తుంటే రాజ్యలక్ష్మి రగిలిపోతుంది.


Also Read: రేవతి ఆన్ ఫైర్- డైరీ అమ్మాయి ముకుందేనని కృష్ణ కనిపెట్టేస్తుందా?


బోనం గురించి దివ్య తులసిని అడుగుతుంది. బోనం విశిష్టత గురించి చెప్తుంది. ఇక అమ్మ వారికి నైవేద్యం చేస్తారు. నందు పక్కన ఉంటే లాస్య వచ్చి కదిలిస్తుంది. మాజీ పెళ్ళాంతో అయితే నవ్వుతూ మాట్లాడతావ్ మరి తాజా మాజీ పెళ్ళాంతో కూడా కాస్త నవ్వుతూ మాట్లాడొచ్చు కదా ఎందుకు మూతి ముడుచుకున్నావని అడుగుతుంది. ఎలాగూ నన్ను వదిలించుకున్నావ్ కాబట్టి తులసికి దగ్గర అవాలని అనుకుంటున్నావా అని అంటుంది. నందు తిట్టేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళి తులసిని కదిలిస్తుంది. తులసిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే దివ్య వచ్చి రెచ్చిపోతే చచ్చిపోతావని వార్నింగ్ ఇస్తుంది. తన ఫ్యామిలీ జోలికి రావొద్దని తులసి గట్టిగా హెచ్చరిస్తుంది. ఇద్దరి దగ్గర జరిగిన అవమానంతో రగిలిపోతుంటే రాజ్యలక్ష్మి వచ్చి పరువు తీస్తున్నావని తిడుతుంది.


విక్రమ్ ఆ గొడవ చూస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మనం ఏం చేసినా గుట్టుగా చేయాలని చెప్తుంది. దివ్య నవ్వుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నా దాని నెత్తి మీద ఉన్న బోనం జారి కిందపడాలి. అది దురదృష్ట జాతకురాలని అందరూ అనుకోవాలి. విక్రమ్ ని నేను నమ్మిస్తాను. నా కూతురు బతుకు ఇలా అయింది ఏంటా అనుకుని తులసి గుండెలు బాదుకోవాలని రాజ్యలక్ష్మి చెప్తుంది. అప్పుడే లాస్యకి తెలిసిన ఆవిడ సంజన వచ్చి పలకరిస్తుంది. పూనకం వచ్చినట్టు ఊగుతూ వెళ్ళి దివ్య బోనం కిందపడేలా చేయాలని చెప్తుంది. అందరూ కలిసి బోనమెత్తుకుని వస్తుంటారు. అప్పుడే సంజన ఊగిపోతూ కావాలని ప్రదక్షిణలు చేస్తున్న దివ్యకి తగులుతుంది. బోనం కిందపడబోతుంటే రాజ్యలక్ష్మి పట్టుకుంటుంది. జాగ్రత్తగా ఉండాలి కదా బోనం కిందపడితే అరిష్టమని మంచిదానిలా నటిస్తుంది. బోనాలు సమర్పిస్తారు. విక్రమ్ మనసు మారి తల్లి గురించి తెలుసుకోవాలని దివ్య కోరుకుంటుంది. అన్నావదిన మళ్ళీ కలుసుకోవాలని నందు చెల్లెలు మాధవి కోరుకుంటుంది.


ALso Read: రాకేష్ తలపగలగొట్టిన అప్పు- రాజ్ కి ఆఫీసు వర్క్ లో సాయం చేసిన కావ్య


రాజ్యలక్ష్మిని లాస్య పక్కకి తీసుకెళ్ళి ఎందుకు బోనం కింద పడకుండా ఆపావని అడుగుతుంది. మనం ప్లాన్ చేయడం దివ్య వినేసిందని చెప్తుంది. బోనం కిందపడేలా చేసిన ఆవిడని పట్టుకుని విక్రమ్ ముందు నిలబెట్టి నిజం చెప్పించేందుకు దివ్య మాస్టర్ ప్లాన్ వేసిందని అనేసరికి లాస్య షాక్ అవుతుంది. ఆశపడింది జరగలేదు కానీ శాంతి పూజ ఉంది కదా అందులో అనుకున్నది చేద్దామని చెప్తుంది.