యష్, వేద సింగపూర్ వెళ్లేందుకు బయల్దేరతారు. ఇంట్లో అందరూ సంతోషంగా వారిని సాగనంపుతారు. ఈ వారం రోజులు కూతురు, అల్లుడు ప్రశాంతంగా ఉంటారని సులోచన అంటుంది. వాళ్ళ సంతోషంగా చూసి కడుపు మంటతో ఏడ్చే వాళ్ళు ఎక్కువ అయ్యారని మాలిని ఇన్ డైరెక్ట్ గా తిడుతుంది. ఆదిత్య ఒంటరిగా ఉండి తల్లి ఏడ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు. భార్యతో బయటకి వెళ్తున్నందుకు యష్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆదిత్య భయం భయంగా జరిగినవన్నీ తలుచుకుంటూ వణికిపోతాడు. అవన్నీ ఆలోచిస్తూ ఉండేసరికి ఆదిత్య ముక్కు నుంచి రక్తం కారుతుంది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాడు. తనని చూసి మాలిని చాలా కంగారుపడుతుంది.


ఇంట్లో అందరికీ చెప్పి వచ్చాను కానీ ఆదిత్యకి చెప్పలేదు తనే గుర్తుకు వస్తున్నాడని వేద అంటుంది. సరే ఇంటికి ఫోన్ చేయమని యష్ అంటాడు. ఆదిత్యని హాస్పిటల్ కి తీసుకుని వెళ్దామని అనుకునేలోపు వేద ఫోన్ చేస్తుంది. మాలిని ఏడుస్తూ ఆదిత్య గురించి చెప్పబోతుంటే కాంచన చెప్పొద్దని అంటుంది. వెంటనే మాళవిక ఫోన్ లాక్కుని ఈ టైమ్ లో నీకు చెప్పకూడదు కానీ చెప్పక తప్పడం లేదు. ఆదిత్య కళ్ళు తిరిగి పడిపోయాడు. ఈ విషయం మిమ్మల్ని డిస్ట్రబ్ చేయడం ఎందుకని.. పర్వాలేదు మీరు వెళ్ళండి. కళ్ళు తిరిగిపడిపోయాడు ముక్కు నుంచి రక్తం కారుతుంది. అయినా మీరేం కంగారుపడకండి సింగపూర్ వెళ్తున్నారు కదా వెళ్ళండి. కానీ ఆదిత్యని చూస్తుంటే భయంగా ఉందని వేయాల్సిన పుల్ల వేసేస్తుంది. వేద యష్ కి విషయం చెప్పడంతో వెంటనే వెనక్కి తిరుగుతారు. ఆదిత్యని హాస్పిటల్ కి తీసుకొస్తారు.


Also Read: తులసి వాళ్ళకి వణుకుపుట్టేలా వార్నింగ్ ఇచ్చిన లాస్య- దివ్య బోనమెత్తకుండా అడ్డుపడుతుందా?


నా కొడుక్కి ఈ పరిస్థితి ఎంత బాధగా ఉందో, మీ సింగపూర్ ట్రిప్ క్యాన్సిల్ అయినందుకు అంత హ్యపీగా ఉందని మాళవిక అనుకుంటుంది. ఎప్పటికైనా నేను అనుకున్నది సాధించే సాధనం వాడేనని సంబరపడుతుంది. ఆదిత్యకి మెలుకువ వచ్చిన తర్వాత డాక్టర్ తనతో మాట్లాడుతుంది. ఎందుకు దేని గురించో భయపడుతున్నావని అడుగుతుంది. నాకు నిజంగానే చాలా భయంగా ఉంటుందని అంటాడు. తల్లి తాగేసి రోడ్డు మీద పడిపోవడం, పూజలో వేద యష్ కలిసి కూర్చోవడం, తల్లి బాధ గురించి మొత్తం డాక్టర్ కి చెప్తాడు. నువ్వేం భయపడకు అన్నీ నువ్వు కోరుకున్నట్టే జరుగుతాయని ధైర్యం చెప్తుంది. డాక్టర్ యష్ వాళ్ళతో మాట్లాడుతుంది. మీ అబ్బాయికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ముక్కులో నుంచి బ్లడ్ రావడానికి కారణం అతడి మానసిక పరిస్థితి. భార్యాభర్తలయిన మీకు మీ కారణాలు ఉండవచ్చు. భార్యాభర్తలుగా విడిపోయిన తల్లిదండ్రులుగా విడిపోయినట్టు కనిపించకూడదు. అది పిల్లల మీద తీవ్రంగా కనిపిస్తుంది. మీరు విడిపోవడం దూరంగా ఉండటం ఆదిత్యని చాలా బాధకి గురి చేశాయి. ఇది ఇలాగే కొనసాగితే పానిక్ డిజార్డర్ గా మారే అవకాశం ఉందని డాక్టర్ చెప్తుంది.


Also Read: కృష్ణ జీవితాల్లో అల్లకల్లోలం- మురారీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ముకుంద


భార్యాభర్తలుగా కలిసి ఉండమని చెప్పండి డాక్టర్ ఎలాంటి అవసరం లేకుండా నేను కోరుకున్నది జరుగుతుందని మాళవిక అనుకుంటుంది. తల్లిదండ్రులుగా పిల్లలతో కలిసి టైమ్ స్పెండ్ చేయమని డాక్టర్ చెప్తుంది. అప్పుడే ఆదిత్య అమ్మనాన్న విడిపోయారనే డిప్రెషన్ లోకి వెళ్ళకుండా ఉంటాడని సలహా ఇస్తుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial