కృష్ణ మురారీతో కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని చెప్తుంది. వాళ్ళు ఆడటం చూసి ముకుంద మురారీకి కాల్ చేస్తుంది. కానీ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు. ఫోన్లో ఎక్స్వైజెడ్ పేరుతో ముకుంద నెంబర్ ఫీడ్ చేసుకుని ఉంటాడు. అది డైరీ అమ్మాయి అనుకుంటా అందుకే అలా నేమ్ ఫీడ్ చేసుకున్నారని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఎన్ని సార్లు ముకుంద కాల్ చేసిన కట్ చేస్తూ ఉంటాడు. ఇక విసిగిపోయి బయటకి వచ్చి తనతో మాట్లాడతాడు. ఎన్ని సార్లు చెప్పినా నువ్వు వినడం లేదు ఇక నీతో మాటలే అనవసరమని విసురుగా వెళ్ళిపోతాడు. కృష్ణ దగ్గరకి వచ్చి రేపే ఇంటికి వెళ్లిపోదాం బ్యాగ్ సర్దమని చెప్తాడు. ఎన్ని సార్లు అబద్ధాలు చెప్తారు? నాకు కోపం వస్తుంది మీ కాలర్ పట్టుకుని ఎన్ని సార్లు అబద్ధాలు చెప్తారని నిలదీయాలని ఉంది.. కానీ నేనేవరిని అలా చేయడానికని కృష్ణ బాధపడుతుంది.


Also Read: కావ్య ఒడిలో పడుకున్న రాజ్- పోలీస్ కేసులో ఇరుక్కున్న అప్పు


నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్పు ముకుంద. నువ్వు చేస్తుంది తప్పు అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తెలుస్తుందని మురారీ అనుకుంటాడు. ఇద్దరూ తిరిగి వెళ్లిపోతుంటే మురారీ మనసులో తను ఉన్నానో లేదో అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. మురారీ వాళ్ళ కారుని ఓవర్ టేక్ చేసి ముకుంద కారు వెళ్ళిపోవడం చూస్తాడు. వేధించడం, వేటాడం ప్రేమ కాదు ముకుంద ఎందుకు ఇలా చేస్తుందని అనుకుంటాడు. కృష్ణ డల్ గా ఉండేసరికి తను హర్ట్ అయ్యింది. మనసులో ఉన్న ప్రేమని చెప్పాలనుకుని చెప్పకుండానే ఉన్నానని బాధపడతాడు. అటు రేవతికి రాజ్ నర్స్ ఫోన్ చేసి కృష్ణ వాళ్ళు బయల్దేరారని చెప్పింది, కొంపదీసి ముకుంద అక్కడికి వెళ్ళిందా? అసలు ఎందుకు వీళ్ళు బయల్దేరారని అనుకుని మురారీకి కాల్ చేస్తుంది. కానీ ఇద్దరూ లిఫ్ట్ చేయరు.ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మకి సర్ది చెప్తానులే అంటాడు. 


Also Read: రంగంలోకి దిగిన లాస్య- అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న దివ్య


రేవతి పంతుల్ని కలిసి కొడుకు, కోడలు జాతకం చూపిస్తుంది. వీళ్లిద్దరినీ ఒక శక్తి విడదీయాలని చూస్తుంది. అబ్బాయి జాతకంలో దోషం ఉంది. వీరి జీవితాల్లో అల్లకల్లోలం మొదలు కాబోతుంది. వీరి కథలో ఎన్నో చిక్కులు. వీళ్ళు కలవకూడదని శని భీష్మించుకుని కూర్చుంది. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవని పంతులు చెప్పేసరికి రేవతి భయపడుతుంది. వాళ్ళు ఎప్పుడు విడిపోకూడదు కలిసే ఉండాలి పరిష్కారం ఏదైనా చెప్పమని వేడుకుంటుంది. మురారీ ఇంక ముకుందని మర్చిపోలేదేమోనని రేవతి అనుమానపడుతుంది. మురారీ వాళ్ళ కంటే ముందుగా ముకుంద ఇంటికి వస్తుంది. డైరీ కనిపించకుండా దాచిపెడుతుంది. ఇంటికి వచ్చిన అలేఖ్యని ఏమి తెలియనట్టు కృష్ణ వాళ్ళ గురించి అడుగుతుంది. వాళ్ళు ఫామ్ హౌస్ కి వెళ్లారని చెప్పేసరికి అయితే వాళ్ళ కంటే ముందు తనే వచ్చానని అనుకుంటుంది. అలేఖ్య వాళ్ళ కళ్ళు గప్పి డైరీ మురారీ గదిలో పెట్టాలని అనుకుంటుంది.