ఇంట్లో వాళ్ళందరూ శ్రీశైలం వెళ్లేందుకు రెడీ అవుతారు. కానీ రాజ్, కావ్య మాత్రం లేట్ గా నిద్రలేస్తారు. కావ్య ఒడిలో ఉండేసరికి ఒక్క అరుపున లేచి రాత్రి ఏమైనా జరిగిందా అని అడుగుతాడు. నా నోటితో నేను ఎలా చెప్తాను అనేసి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. అమ్మో అంటే ఏంటి నా జీవితంలో నేనే నిప్పులు పోసుకున్నానా అని ఏడుస్తాడు. రాజ్, కావ్య కిందకి వచ్చేసరికి లగేజ్ తో ఉండేసరికి విషయం అడుగుతారు. శ్రీశైలం వెళ్లాలని మొక్కుకున్నామని ఇంద్రాదేవి చెప్తుంది. రాజ్ వాళ్ళని త్వరగా రెడీ అయి రమ్మని చెప్తుంది. అసలు కుదరదని డల్లాస్ నుంచి తెలుగు అసోసియేషన్ వాళ్ళు వస్తున్నారని అంటాడు. కావ్యని రమ్మంటే ఆయన రాకుండా తను ఎలా వస్తానని అంటుంది. తన కోసం ఎవరూ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని మీ కోడల్ని తీసుకుని వెళ్ళమని రాజ్ చెప్తాడు. అందరి ముందు అరుస్తావ్ కానీ ఎవరూ లేనప్పుడని ధాన్యలక్ష్మి అనేసరికి రాజ్ బిత్తరపోయి వద్దులే కళావతి ఇంట్లోనే ఉంటుందని అంటాడు.


Also Read: మహేంద్ర వాళ్ళ చెంతకి చేరిన ఫణీంద్ర- దాచినా దాగని రిషి ప్రేమ, ఎంతైనా జెంటిల్మెన్ కదా!


అప్పు తండ్రికి ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. పక్కనే ఉన్న ఫ్రెండ్స్ ఏంటి అప్పు డల్ గా ఉన్నావని అడుగుతారు. ఏదో ఒకటి చేసి నాన్నకి సపోర్ట్ చేయాలని చెప్తుంది. ఇప్పటి వరకు క్యాటరింగ్ చేశాం ఇప్పుడు ఈవెంట్ మొత్తం చేద్దామని ఐడియా ఇస్తాడు. అది కుదరదని అంటుంది. ఒక ఆర్గనైజేషన్ ఉంది ఎవరినైనా సెలెబ్రెటీని పిలిస్తే మనకి ఆ కాంట్రాక్ట్ వస్తుందని చెప్తాడు. మీ బావ రాజ్ ఉన్నాడు కదా ఆయన్ని పిలువు మంచి హైప్ వస్తుందని అంటే అది జరగని పని అని అప్పు అంటుంది. ఎందుకు జరగదు మీ అక్క ఇష్టం లేకపోయినా మీ బావ చేసుకున్నాడు. అందరి ముందు కలరింగ్ ఇవ్వడానికి బాగున్నట్టు నటిస్తున్నాడు. అక్కడ మీ అక్క మాటకి దిక్కె లేదు నీ మాట ఎవరు వింటారు. అయినా అసలు కాలనీ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా మీ అక్క ఆ ఇంటికి జీతం లేని పని మనిషని రాకేశ్ నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఆ మాటలకి అప్పు కోపంగా వద్దని వారిస్తుంది. మీ పెద్దక్క కడుపు చేసుకుని పెళ్లి చేసుకుంది నువ్వు కూడా ఆ ఇంట్లో ఏదో ఒక మగాడిని చూసి తగులుకోమని అనేసరికి అప్పు లాగిపెట్టి కొడుతుంది. అయినా రాకేశ్ వాగుతూనే ఉండేసరికి పక్కనే బ్యాట్ తీసుకుని తల పగలగొడుతుంది.


Also Read: కళ్ళు తిరిగిపడిపోయిన ఆదిత్య- యష్ ట్రిప్ క్యాన్సిల్, అనుకున్నది సాధిస్తున్న మాళవిక


రక్తం వస్తుందని అరుస్తాడు. హాస్పిటల్ కి తీసుకుని వెళ్దామని అప్పు అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి తనని అక్కడి నుంచి పంపించేస్తారు. ఇంట్లో రాజ్ వర్క్ అవలేదని ఆఫీసుకి ఫోన్ చేసి అరుస్తాడు. డిజైన్స్ అవకపోతే ప్రాజెక్ట్ మిస్ అవుతుందని తిడతాడు. ఏం జరిగిందని కావ్య అడుగుతుంది. ఆమెరికాలోనిన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు అక్కడ గుడి కడుతున్నారు. అక్కడికి కిరీటాలు, ఆభరణాలు మనకే ఆర్డర్ ఇచ్చారు. మా వాళ్ళు ఇంకా పని పూర్తి చేయలేదు. వాళ్ళు యాంటిక్ డిజైన్స్ అడుగుతారని చెప్తాడు. ఈ ప్రాబ్లం ఎలాగైనా సాల్వ్ చేయాలని అనుకుని కావ్య ఆఫీసుకు వస్తానని అడుగుతుంది. వద్దని అనేసరికి రాత్రి ఏం జరిగిందంటే.. అని సాగదీస్తుంది. ఆఫీసుకి తీసుకెళ్తే చెప్తానని అంటుంది. సరే అయితే తీసుకెళ్తా మంచి చీర కట్టుకుని రమ్మని చెప్తాడు. రాజ్ కారులో వెళ్తుంటే తనలో ఉన్న మంచి క్వాలిటీస్ గురించి కావ్య గొప్పగా చెప్తుంది. మీలో క్షమించే గుణం ఉంది రాహుల్ ఎంత ద్రోహం చేసినా మీరు సులభంగా క్షమించారని మెచ్చుకుంటుంది.