వసు వాటర్ బాటిల్ తీసుకోబోతూ మంచం మీద నుంచి జారి కిందపడిపోతుంది. సౌండ్ రావడంతో రిషి తన దగ్గరకి వెళ్లబోతూ తను పిలవకుండా నేనెందుకు వెళ్ళాలి, పిలిస్తే కదా వెళ్లాలని అనుకుని ఆగిపోతాడు. మళ్ళీ పిలవలేదంటే అవసరం లేదని కాదుగా అనుకుని గదిలోకి వెళ్ళి చూసేసరికి కిందపడిపోయి ఉంటుంది. ఏం జరిగిందని అడుగుతాడు. వాటర్ బాటిల్ అందుకోబోయి పడిపోయానని చెప్తుంది. లేవొచ్చు కదా అంటాడు. లేచే ఓపీకే ఉంటే పడేదాన్ని కాదు సర్ అనగానే తనని చెయ్యి పట్టుకుని పైకి లేపి మంచం మీద కూర్చోబెడతాడు. ఓపిక లేకపోతే పిలవొచ్చు కదా అంటాడు. పిలిస్తే మీరు వస్తారో రారోనని అమాయకంగా చెప్తుంది. సాటి మనిషిగా యాక్సిడెంట్ అయితే సాయం చేసిన వాడిని వాటర్ బాటిల్ ఇవ్వలేనా అని అందిస్తాడు. బాటిల్ మూత రాక ఇబ్బంది పడుతుంటే తీసి గ్లాసులో నీళ్ళు పోసి ఇస్తాడు.


వసు: థాంక్స్ సర్


రిషి: మీరేం థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మేడమ్. ఇది మీకోసం చేసింది కాదు నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు వీళ్ళు. నాకు కావలసింది ఈ ఇల్లు చక్కగా ఉండాలి. మీ దగ్గర వాళ్ళకి మాట రాకూడదు అందుకే వచ్చాను. అన్నీ పక్కనే పెట్టాను. మీకు నా అవసరం రాకుండా చూసుకోండి. తప్పనిసరి అయితే మాత్రమే పిలవండి మేడమ్


వసు: పిలిస్తే పలికెంత దగ్గర్లోనే ఉండండి సర్


Also Read: కళ్ళు తిరిగిపడిపోయిన ఆదిత్య- యష్ ట్రిప్ క్యాన్సిల్, అనుకున్నది సాధిస్తున్న మాళవిక


మహేంద్ర, జగతి కాలేజ్ గెస్ట్ హౌస్ లో ఉంటారు. మనం ఇలా వచ్చామని తెలిసిన వెంటనె అన్నయ్య చాలా బాధపడతారు. ఆయన్ని తలుచుకుంటేనే బాధగా ఉంది. కానీ శైలేంద్ర వదిన కలిసి పదవి కోసం కన్నతల్లి నీతోనే కొడుకు మీద అభియోగం మోపించారు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి అసలు తట్టుకోలేకపోతున్నానని మహేంద్ర బాధపడతాడు. అప్పుడే ఫణీంద్ర కోపంగా వాళ్ళ దగ్గరకి వస్తాడు.


ఫణీంద్ర: ఎందుకు ఇలా నాకు చెప్పాపెట్టకుండా వచ్చారు? ఏంటి జగతి చెప్పండి. శైలేంద్ర, దేవయాని ఏమైనా అన్నారా? వర్క్ విషయంలో ఏమైనా కలగజేసుకున్నారా? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. రిషి మీద నింద మోపి ఇంట్లో నుంచి పంపించేశారు. ఇప్పుడు ఇంట్లో నుంచి వచ్చేశారు. ఏం జరిగిందో చెప్పండి


మహేంద్ర: ఏ సమస్యా లేదన్నయ్యా మిషన్ ఎడ్యుకేషన్ కోసమే ఇక్కడికే వచ్చాము. వర్క్ విషయంలో శైలేంద్ర వాళ్ళు కలుగజేసుకుంటే ఎలా డెవలప్ చేస్తారో చెప్తారు కదా


ఫణీంద్ర: మరి నేను ఇంటికి వచ్చాక చెప్పి రావొచ్చు కదా కనీసం ఫోన్ అయినా చేయవచ్చు కదా


మహేంద్ర: మీరు కోర్టు పని మీద వెళ్లారు కదా డిస్ట్రబ్ చేయడం ఎందుకని


ఫణీంద్ర: సరే అయితే నేను కూడా మీతో ఇక్కడే ఉండి మీకు హెల్ప్ చేస్తాను


జగతి: మీరు ఇక్కడ ఎందుకు బావగారు ఇంటికి వెళ్ళండి


ఫణీంద్ర: లేదు జగతి మీతో కలిసే వర్క్ చేస్తా. మీరు ఇంటికి వస్తారా? లేదంటే ఇక్కడే ఉండి వర్క్ చేస్తాను


మహేంద్ర: సరే అన్నయ్య ఇక్కడే ఉందాం


జగతి: బావగారు ఇక్కడే ఉండటానికి ఎందుకు ఒప్పుకున్నావ్


Also Read: తులసి వాళ్ళకి వణుకుపుట్టేలా వార్నింగ్ ఇచ్చిన లాస్య- దివ్య బోనమెత్తకుండా అడ్డుపడుతుందా?


మహేంద్ర: తప్పలేదు అన్నయ్య నన్ను వదిలి ఉండలేరు అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది. అన్నయ్యకి అబద్ధం చెప్పినందుకు గిల్టీగా ఉంది. శైలేంద్ర గురించి నిజం చెప్తే తట్టుకోలేరు. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది.


ఇక రిషి, వసు ఒకరి గురించి మరొకరు ఆలోచించుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడో దూరం అయ్యాము అది నువ్వు గుర్తించాలని రిషి అనుకుంటాడు. నువ్వు కేవలం వసుధారవి, నేను రిషిని ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదంటాడు. అప్పుడే ఏంజెల్ ఫోన్ చేసి రావడానికి కాస్త టైమ్ పడుతుందని చెప్తుంది. వసుకి ట్యాబ్లెట్స్ ఇచ్చే టైమ్ అయ్యింది వెళ్ళి ఇవ్వమని అంటుంది. రిషి వసు గదిలోకి పర్మిషన్ అడిగి వెళతాడు. తనకి ట్యాబ్లెట్స్ ఇస్తాడు. నీళ్ళు తాగుతుంటే పొలమారుతుంది. వెంటనే రిషి కంగారుగా తన తల మీద నిమురుతాడు. గతం గుర్తు చేసుకోకూడదని చాలా ప్రయత్నిస్తున్నారు కదా మరి మీ చేతికి ఉన్న ఆ బ్రేస్ లెట్ గతాన్ని గుర్తు చేయడం లేదా అని అడుగుతుంది. ఇది ఉంటేనే కదా నాకు జరిగిన మోసం అన్నీ గుర్తుకు వచ్చేది. అయినా నేను మాట ఇస్తే తప్పను, కొంతమందిలాగా మోసం, ద్రోహం చేసే అలవాటు లేదు. అయినా ఇది పెట్టుకుని సంతకాలు పెట్టమని చెప్పారు నేను జ్ఞాపకాలు వదులుకోలేను. ఎందుకంటే నేను జెంటిల్ మెన్ అనేసి వెళ్ళిపోతాడు.