Rangula Ratnam July 5th: సిద్దు కష్టాల్లో ఉన్న కూడా బ్రతికే మార్గం తెలుసుకోవాలి అని నువ్వు నా భార్యవి కాబట్టి నీ బాధ్యత కూడా నేనే చూసుకోవాలి తనను తీసుకొని గుడి దగ్గరికి వెళ్తాడు. ఇక పూర్ణ, శంకర ప్రసాద్ కూడా గుడి దగ్గరికి వెళ్లగా దేవుడి ముందు తన బాధను మొత్తం చెప్పుకొని బతికుండడం వేస్ట్ అని పూర్ణ దగ్గరికి పంపించమని వేడుకుంటాడు. పూర్ణ తన భర్త తిరిగి మామూలు మనిషి అయి అందరం కలిసి ఉండేటట్టు చేయమని కోరుకుంటుంది.


ఇక అప్పుడే పూజారి ఈరోజు ఇక్కడ ఒక కథ చెప్పబడుతున్నారు.. అక్కడికి వెళ్లి వినండి అని వారికి సలహా ఇస్తాడు. దాంతో పూర్ణ వాళ్లు అక్కడే ఒక చెట్టు దగ్గర కూర్చుంటారు. అదే సమయంలో గుడి దగ్గర ఉన్న స్వప్నకు ఆకలి వేయటంతో సిద్దు గుడిలోకి వెళ్లి ప్రసాదం తీసుకొని వస్తాడు. ఇక వాళ్లు కూడా అక్కడే కూర్చొని ఉంటారు. ఆ సమయంలో ఒక గురువు కథ చెబుతూ ఉంటాడు. అందులో తల్లితండ్రుల పిల్లల మధ్య ఉన్న ప్రేమ గురించి వివరిస్తూ ఉంటాడు.


ఇక ఆ కథ వింటున్న శంకర్ ప్రసాద్ ఇవన్నీ వినటానికి బాగుంటుంది కానీ నిజంగా బాగుండవు అని అంటాడు. సిద్దు కూడా ఆ కథ వింటూ ఎప్పుడో ఈ కథ వింటే బాగుండేది. నాకోసం అన్ని తెచ్చి పెట్టిన నాన్నను దూరం చేసుకున్నాను. అమ్మను సరిగ్గా చూసుకోలేక పోయాను అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక శంకర్ ప్రసాద్ కూడా నా అనుకున్న వాళ్లు తనను మోసం చేశారు అని.. తన కొడుకులకు తను ఎంతో తెచ్చి పెట్టిన కూడా వాళ్ళు తనను దూరం చేశారు అని చెప్పుకుంటూ బాధపడతాడు.


ఇక పూర్ణ మీరు ఇక్కడే ఉంటే మరింత బాధపడతారు అని తీసుకొని వెళ్తుండగా వారిని సిద్దు, స్వప్న చూస్తారు. నాన్న వెంబడి అర్చన ఉంది ఏంటి అని అనుకుంటారు. ఇక స్వప్న కూడా తను కూడా రేఖ లాగా డబ్బు ఆశపడి వచ్చిందనుకున్నాము.. కానీ ఇప్పుడు మామయ్య దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని అనటంతో సిద్దు కూడా అవును కష్టాల్లో ఉన్న నాన్నను అందరు దూరం పెట్టారు.. ఆ సమయంలో భార్య తోడు ఉంటుంది అంటే అర్చన తన తల్లి పూర్ణనా అని ఇప్పుడే నిజం తెలుసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్తాడు.


మరోవైపు సత్యం.. ప్రసాద్ గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఏదో కీడు జరగబోతున్నట్లు అనిపిస్తుంది అనటంతో జానకి కూడా తనకు కూడా పొద్దుట్నుంచి కుడి కన్ను అదురుతుందని అంటుంది. అప్పుడే సీత ఏడ్చుకుంటూ వచ్చి వర్ష పరిస్థితి గురించి చెప్పటంతో వాళ్ళు షాక్ అవుతారు. ఇక ఇప్పుడే హాస్పిటల్ కి వెళ్ళాలి అని జానకి అనడంతో ఆ మంగళసూత్రం కూడా తీసుకొని రమ్మని అంటాడు సత్యం.


ఇంకా హాస్పిటల్లో ఉన్న శంకర్ ప్రసాద్ రేఖ తనను మోసం చేసిన సంఘటనలను గుర్తుకు చేసుకొని మోసపోయాను అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రేఖ హాస్పిటల్ కి వచ్చి ప్రసాద్ ఉన్న గదిలోకి వచ్చి వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా తనకు ఆయనపై కోపం రావడానికి కారణాలు కూడా చెబుతూ ప్రసాద్ ను బాగా రెచ్చగొడుతుంది.


వెంటనే ప్రసాద్ నిన్ను చంపి జైల్లోనైనా ఉంటాను అని తన దగ్గరికి కోపంతో వెళ్లడంతో వెంటనే కింద పడతాడు. తరువాయి భాగంలో సిద్దు హాస్పిటల్ కి వెళ్లగా అక్కడ డాక్టర్ తనవి పూర్ణ వి డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయ్యాయని చెప్పటంతో వెంటనే సిద్దు తన తండ్రి దగ్గరికి వెళ్తుండగా పూర్ణ ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని ప్రశ్నించడంతో అమ్మ అని అంటాడు సిద్దు.


Also Read: Madhuranagarilo July 5th: ‘మధురానగరి’లో సీరియల్: ఫ్రెండ్ ప్రేమను పండు గెలిపించనున్నాడా, రాధతో లవ్ యూ చెప్పించుకోవాలనుకున్న శ్యామ్?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial