Madhuranagarilo July 5th: శ్యామ్ రాధ తో తన ప్రేమ గురించి చెబుతున్న సమయంలో అప్పుడే పండు వచ్చి నిద్ర వస్తుంది టాబ్లెట్ వేయమని అంటాడు. వెంటనే రాధ పండుని ఇంటికి తీసుకెళ్లగా శ్యామ్ అవకాశం మిస్సయింది అని బాధపడతాడు. ఇక పండు కి టాబ్లెట్ వేద్దామని రాధ వెతుకుతూ ఉండగా టాబ్లెట్లు అయిపోవడంతో పర్వాలేదు రేపు వేసుకోవచ్చు లే అని అంటాడు పండు. డాక్టర్ రోజు వేసుకోమన్నారు అని రాధ అనటంతో.. ఒక్కరోజు వేసుకోకపోతే చనిపోతానా అని అనటంతో రాధ అలా అనొద్దు అని బాధపడుతుంది.


ఇప్పుడే వెళ్లి నేను టాబ్లెట్ తీసుకొస్తాను అని అనటంతో ఈ చీకట్లో ఒక్కదానివి ఎక్కడ వెళ్తావు అని శ్యామ్ ఫ్రెండ్ ని తీసుకెళ్ళు అని అంటాడు పండు. వద్దు నేనే వెళ్తాను అని రాధ అనటంతో అప్పుడే శ్యామ్ వచ్చి నేను వెళ్లకూడదా అని మాట్లాడుతూ పండు కి కావలసిన టాబ్లెట్లు ఇస్తాడు. దాంతో రాధ నీకెలా తెలుసు అనటంతో శ్యామ్ గతంలో తన ఈ టాబ్లెట్లు తీసుకున్నప్పుడు ఒకటే షీట్ ఉందని.. ఇక నువ్వు పెళ్లి హడావిడిలో మర్చిపోతావ్ ఏమో అని నేనే తెచ్చి పెట్టాను అని అంటాడు. దాంతో రాధ శ్యామ్ మంచి మనసును ఫీల్ అవుతూ ఉంటుంది.


ఇక ఆ తర్వాత వారు పడుకోడానికి మధుర ఇంటికి వెళ్తారు. మరోవైపు నెల్సన్ తన భార్య శిరోజాకు బంగారు నెక్లెస్ తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేయటంతో తను అంత సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వదు. తన దగ్గర రోల్డ్ గోల్డ్ తీసి గోల్డ్ వేసే వరకు నువ్వు నా పైన చెయ్యి వేసేది లేదు అని అంటుంది. కానీ నెల్సన్ ఒక ముద్దైన ఇవ్వు అనటంతో శిరోజా దగ్గర వరకు వచ్చి ఫోన్లో నెల్సన్ ఫోటో కి ముద్దు పెడుతుంది. దాంతో నెల్సన్ చాలా బాధగా ఫీల్ అవుతాడు. అదంతా గన్నవరం వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయాలని ఫిక్స్ అవుతాడు.


మరుసటి రోజు ఉదయాన్నే శ్యామ్ జరిగినవన్నీ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి పండు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను అది అవ్వాలని అనుకుంటున్నాను అనటంతో మీరు ఏది అనుకుంటే అది కచ్చితంగా అవుతుంది అని పండు ధైర్యం ఇస్తాడు. కావాలంటే ఒక ఛాలెంజ్ చేయండి అని గులాబీ పువ్వును కళ్ళు మూసుకొని మూడుసార్లు ఎగరేసి ఒక్కసారి పట్టుకున్న కూడా మీరు అనుకున్నది అవుతుంది అనటంతో శ్యామ్ అలా రెండుసార్లు చేస్తాడు.


కానీ రెండుసార్లు గులాబీ పువ్వులు పట్టుకోలేక పోతాడు. ఇక మూడోసారి పండు అంకుల్ తన కోరిక తీరదేమోని బాధపడుతున్నాడు అని ఈసారి ఎలాగైనా పట్టుకోవాలి అని అనుకుంటాడు. ఇక శ్యామ్ మూడోసారి పైకి విసిరేయటంతో వెంటనే అది పండు పట్టుకొని శ్యామ్ చేతిలో వేస్తాడు. దానితో శ్యామ్ తను అనుకున్నది తీరుతుంది అని తెగ సంతోషపడతాడు. అంటే తనకు రాధ తో పెళ్లి చేయడానికి పండు సపోర్ట్ ఉంటుందని అర్థం అవుతుంది.


అదే సమయంలో శ్యామ్ ను మధుర పిలవడంతో వాళ్లు సంతోషంగా కిందికి వస్తారు. ఇంత సంతోషంగా ఉన్నారు ఏంటి అని అడగటంతో.. గేమ్లో శ్యామ్ విన్ అయ్యాడు అని అంటాడు పండు. కానీ మధుర పండు గెలవాల్సింది అని అనటంతో అప్పుడే రాధ కూడా వస్తుంది. ఇక మధ్యలో దంపతులు తమ పెళ్లి కార్డులు ఇవ్వటానికి సూర్యాపేటకు వెళ్తున్నాము అనడంతో దాంతో శ్యామ్ వెళ్ళండి వెళ్ళండి అని.. తనకు రాధతో ప్రపోజ్ చేయడానికి టైం దొరుకుతుంది అని అనుకుంటాడు.


ఇక వాళ్ళు తిరిగి సాయంత్రం లోపే వస్తాము అంటారు. ఆ సమయంలోపే రాధకు ఐ లవ్ యు చెప్పి తనతో కూడా లవ్ యు టూ చెప్పించుకోవాలి అని అనుకుంటాడు. ఇక మధుర వాళ్ళు వెళ్తుండగా సంయుక్త ఫోన్ చేసి మీ కాలనీకి మా ఫ్రెండ్స్ కార్డు ఇవ్వడానికి వస్తున్నాము అనటంతో తాము సూర్యపేటకు వెళ్తున్నాము అని చెబుతోంది మధుర. మరి శ్యామ్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడా తనకి ఫుడ్డుకి ఇబ్బంది కాదా అనడంతో రాధ చూసుకుంటాను అన్నది అనడంతో సంయుక్తకు కోపం వస్తుంది. ఫోన్ కట్ చేశాక కోపంతో రగిలిపోతుండగా అప్పుడే తన తల్లి రావటంతో తనకి విషయం చెబుతుంది. వెంటనే అక్కడికి వెళ్లాలి అనటంతో అపర్ణ వద్దు అని.. అక్కడ ఏం జరగదు అని వాళ్ళ సాయంత్రంలోపే వస్తారు కదా అని అంటుంది. 


Also Read: Madhuranagarilo July 4th: ‘మధురానగరిలో’ సీరియల్: కాబోయే భర్తతో ప్రపోజ్ చేయించుకున్న సంయుక్త, రాధపై ప్రేమ పరీక్ష చేసిన శ్యామ్?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial