యష్ జలుబు చేసి తుమ్మలేక ఇబ్బంది పడుతుంటే పసుపు వేసి వేడి నీళ్ళు తీసుకొస్తుంది వేద. కాసేపు ఆవిరి పట్టమంటే యష్ వేడి లేదు స్మెల్ లేదని అబద్దం చెప్తాడు. తనకి తెలియదని చెప్పి పెళ్ళాం మీద కూడా దుప్పటి ముసుగు వేసేస్తాడు. కాసేపు కళ్ళూ కళ్ళూ ఊసులాడుకుంటాయి. ఖుషి వేద దగ్గరకి వచ్చి అమ్మాయిలు బలవంతులా, అబ్బాయిలు బలవంతులా అని అడుగుతుంది. అమ్మాయిలు ఏ విషయంలోని బలహీనులు కాదని అంటుంది. హాల్లోకి తీసుకొచ్చి ఆదిత్యతో ఆడపిల్లలు బలహీనలు కాదని చెప్తుంది. అప్పుడే యష్ కూడా వచ్చి ఏమైందని అంటే తనకి అన్నయ్యకి మధ్య చిన్న ఛాలెంజ్ జరిగిందని చెప్తుంది. ఏంటి అది అంటే అమ్మాయిలే బలవంతులు అంటే అవునా అయితే తనతో పోటీకి దిగమని యష్ చెప్తాడు.


Also Read: ముకుందతో మురారీని చూసిన కృష్ణ- తప్పుగా అర్థం చేసుకుని దూరమవుతుందా?


యష్, వేద చేతులతో కుస్తీ పడతారు. యష్ బలం ముందు ఆగలేక వేద చెయ్యి కిందకి పడబోతుంటే ఖుషి వచ్చి తల్లికి అండగా నిలబడుతుంది. ఇక అటు యష్ కి తోడుగా ఆదిత్య వస్తాడు. అందరూ సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. ఈ ఆటలో లేడీస్ గెలుస్తారని మాలిని అంటుంది. ఈ ఇంట్లో సంతోషం ఉంటే అందులో నేను ఉండాలి లేదంటే నేను చెడగొట్టాలి. వీళ్ళు సంతోషంగా ఉంటే చూస్తూ ఉండకూడదని అనుకుని వచ్చి యష్ వైపు చెయ్యి వేస్తుంది. యష్ కోపంగా చెయ్యి వెనక్కి లాగేసుకుంటాడు. అందరికీ పిల్ల చేష్టలు ఎక్కువ అయ్యాయి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే బాగుంటుందని యష్ సీరియస్ గా చెప్తాడు. ఆదిత్య, ఖుషి కూడా హెల్ప్ చేస్తున్నారు కదా మీరు ఒడిపోతున్నారని సపోర్ట్ చేశానని మాళవిక చెప్తుంది. ఆపు కొందరి సపోర్ట్ తో గెలవడం కన్నా ఒడిపోవడమే మంచిది. ఇంకెప్పుడు ఇలా మధ్యలోకి దూరకు అనేసి వెళ్ళిపోతాడు. నాకు కావలసింది ఇదే నువ్వు నన్ను దూరం పెట్టడం అది నా కొడుకు చూడటమని కావాలని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆదిత్య బాధగా తల్లి వెనుకాలే వెళతాడు.


ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో తెలుసుకోవడం కోసం ఖైలాష్ ఆత్రంగా అభిమన్యు దగ్గరకి వస్తాడు. తనని పిలిస్తే సోఫా వెనుక నుంచి అభి బయటకి వచ్చి మెల్లగా మాట్లాడని భయపడుతూ ఉంటాడు. ఏంటి బ్రో రాత్రి శోభనం జరగలేదా అని అడుగుతాడు. మధుర రాత్రి కావాలని అనుకున్నా కానీ కాళ రాత్రి చేసేసిందని జరిగింది మొత్తం చెప్పేసరికి ఖైలాష్ షాక్ అవుతాడు. సిస్టర్ లో ఈ యాంగిల్ అసలు ఊహించలేదని నోరెళ్ళబెడతాడు. అప్పుడే నీలాంబరి కాఫీ పట్టుకుని అమాయకంగా వస్తుంది. ఆశీర్వదించమని అభి కాళ్ళ మీద పడుతుంటే భయంతో వణికిపోతూ వెనక్కి వెళ్ళిపోతాడు. పొద్దున్నే నీకేం పని కొంపకి వచ్చావని తిడుతుంది. ఏం జరుగుతుందో ఏమైపోతానో తెలియడం లేదని అభి భయపడతాడు. నాకు మాత్రం ఒకటి అర్థం అయ్యింది మాళవిక ఉండి ఉంటేనే బాగుంది వదిలి తప్పు చేశావని ఖైలాష్ చెప్తాడు.


ALso Read: కావ్య వేసిన డిజైన్స్ చింపేసిన రాజ్- అప్పు మీద మర్డర్ కేసు


ఆఫీసులో వసంత్ కి ప్రమోషన్ ఇచ్చి అమెరికాలో జాబ్ ఇస్తాడు. ఇదేంటని వసంత్ వచ్చి యష్ ని నిలదీస్తాడు. పెళ్లి అయ్యింది బాధ్యతలు నీకు పెరిగాయి అందుకే ప్రమోషన్ ఇచ్చానని అనుకుంటున్నావ్ కదా. అదీ నిజమే నీకు ఇప్పుడు పెళ్లి అయ్యింది. బాధ్యతలు, సరదాలు ఉంటాయి. నీ విషయంలో నాకు బాధ్యత ఉంది. మీ ఫ్యూచర్ బాగుండాలి ఒక అవకాశం వచ్చింది అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయి ఒక రేంజ్ కి ఎదగాలని చెప్తాడు. యష్ నిర్ణయానికి వసంత్ ఒప్పుకోడు.