కృష్ణ బట్టల్లో డైరీ ఉండటం మురారీ కంట పడుతుంది. డైరీలా ఉందే అనుకుని దాన్ని తీసుకుని ఇది మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? కృష్ణ పెట్టిందా? లేదంటే అమ్మ చూసి ఇక్కడే పెట్టేసిందా అనుకుంటాడు. అమ్మ చూస్తే తిట్టేది పైగా ఈ డైరీ ఓపెన్ చేసి ఉందని చూసేసరికి అందులో కవిత దాని కింద నీ ముకుంద అని సిగ్నేచర్ చూసి షాక్ అవుతాడు. కోపంతో ఆ పేజ్ చింపేసి జేబులో పెట్టేసుకుంటాడు. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావ్ టీనేజ్ పిల్లలా ఏంటి ఈ బిహేవియర్ అనుకుంటాడు. మీరు మిషన్ అని అబద్ధం చెప్పారు కదా? మరి మిషన్ కి వెళ్తూ గన్ ఎవరైనా మర్చిపోతారా? గాయపరిచిందని గతాన్ని కలిసి రావడం లేదని కాలాన్ని తిట్టుకోకూడదు. ప్రతి దానికి ఒక మలుపు ఉన్నట్టు మనకి ఒక మలుపు ఉంటుంది. ఆ మలుపులో గెలుపు దాగుందేమోనని ధైర్యం చెప్పి పంపిస్తుంది.


ALso Read: కావ్య వేసిన డిజైన్స్ చింపేసిన రాజ్- అప్పు మీద మర్డర్ కేసు


మిషన్ అనేది అబద్ధం నీ ముందు నేను దోషిలా నిలబడలేను. మా పెళ్లి అగ్రిమెంట్ కాదు పర్మినెంట్ అని చెప్పేస్తానని మురారీ మనసులో అనుకుని కృష్ణని బయటకి తీసుకుని వెళతాడు. కృష్ణ మురారీని ప్రేమిస్తుందా? ఒకవేళ ప్రేమిస్తే ఏం చేయాలి నేను సైలెంట్ గా వెళ్లిపోవాలా? మళ్ళీ త్యాగమూర్తిగా ఉండిపోవాలా? ఏం చేయాలని ముకుంద మధనపడుతుంది. నా ప్రేమని త్యాగం చేస్తే ఏమైంది కన్నీళ్ళు మిగిలాయి. ఇప్పుడు మురారీ నన్ను అసహ్యించుకుంటున్నాడు. ఇక ఈ త్యాగాలు వద్దు మురారీ మొదటి ప్రేమ పొందింది నేనే. దాన్ని ఎవరూ లాగేసుకోవడానికి వీల్లేదు. అసలు కృష్ణ మురారీని ప్రేమిస్తుందా? అని ఆలోచిస్తుంది. మురారీ ఒక చోట ఆపి తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటాడు. అటు కృష్ణ కూడా డైరీ అమ్మాయి గురించి చెప్తాడు ఏమోనని భయపడుతుంది. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటని మురారీ అడుగుతాడు.


Also Read: ఫస్ట్ నైట్ లో అభిమన్యుని వణికించేసిన నీలాంబరి- యష్, వేద మధ్యలో మాళవిక


మనది అగ్రిమెంట్ అనుకుంటే మీతో ఇలా సన్నిహితంగా ఎలా ఉంటాను. మీరే నా సర్వస్వమని ఎలా చెప్పనని అనుకుంటుంది. మరి మీ ఫ్యూచర్ ఏంటని రివర్స్ ప్రశ్నిస్తుంది. ఐదేళ్లలో డీసీపీ అయి ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నానని చెప్తాడు. అంటే ఆ ఇద్దరి పిల్లల తల్లి ఎవరు డైరీ అమ్మాయా? లేదంటే నేనా అని కృష్ణ ఆలోచిస్తుంది. తనది ఇదే సమాధానమని అంటుంది. నిన్ను.. అది.. కృష్ణ అని మురారీ చెప్పబోతుంటే సరిగ్గా టైమ్ కి రేవతి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. ఇక ఐదు నిమిషాలు ఆగి కాల్ చేసి ఉంటే బాగుండేది కదా మమ్మీ ఎందుకు డిస్ట్రబ్ చేశావాని తిట్టుకుంటాడు. కృష్ణని తీసుకుని మళ్ళీ  మురారీ ఇంటికి వస్తాడు. గుమ్మం బయట చెప్పులు చూసి డైరీ అమ్మాయి ఇంటికి వచ్చిందా అని టెన్షన్ పడుతుంది. ఫామ్ హౌస్ లో చూసిన అవే చెప్పులు ఇంట్లో కూడా ఉన్నాయని గుర్తు చేసుకుంటుంది.