కావ్య మీద కోపంతో అన్నం తినకుండా ఉంటాడు. ఐస్ క్రీమ్ తింటుంటే శుభ్రంగా నేను చేసిన వంట తింటే ఈ చెత్త తినే పని ఉండేది కాదు కదా అంటుంది. శృతి వేసిన డిజైన్స్ చాలా బాగున్నాయని తెగ మెచ్చుకుంటాడు. అవి కావ్య డిజైన్స్ కనుక మనసులోనే పొంగిపోతుంది. నా ప్రేమని గుర్తించలేదు కనీసం నాలోని టాలెంట్ ని గుర్తించారని మురిసిపోతుంది. కృష్ణమూర్తి వాళ్ళు పోలీస్ స్టేషన్ బయటే ఉంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళని అప్పు చూసి ఒకసారి నాన్నని పిలవమని కానిస్టేబుల్ ని అడుగుతుంది. రెండు చీవాట్లు పెట్టి కానిస్టేబుల్ కృష్ణమూర్తిని పిలుస్తుంది. రాజ్ గదిలో ఒక్కడినే ఉన్నాను ఇంట్లో ఇద్దరమే ఉన్నాం. ఏ మాత్రం తేడా జరిగినా ముగ్గురం అవుతాం. నా శీలం దొంగిలించబడుతుంది. అమ్మో ఎలాగైనా కళావతి రాకుండా ఆపేయాలని అనుకుని గది డోర్ దగ్గర అడ్డంగా నిలబడతాడు. హల్లోకి వెళ్ళి పడుకోమని చెప్తాడు. కానీ కావ్య మాత్రం కుదరదని చెప్పి రాజ్ ని తోసేసి లోపలికి వెళ్తుంది.


Also Read: మాళవికకి ఇక చుక్కలే, రసవత్తరంగా మారిన కథ- వేదని ఏడిపించిన ఆదిత్య


కాసేపు ఇద్దరూ వాదించుకుంటారు. ఇక చేసేది లేక రాజ్ బెడ్ మీద పడుకుంటాడు. ఇంటికి వెళ్ళమని అప్పు తండ్రికి చెప్తుంది. కావ్య అక్కలాగా ఎప్పుడూ నీకు సాయం చేయలేదు. ఇప్పుడు ఒకడి తల పగలగొట్టి స్టేషన్ లోకి వచ్చాను నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది. లేదు నిన్ను చూస్తే గర్వంగా ఉంది. స్వప్న అంటే నీకు అసలు ఇష్టం లేదు కానీ తనని బయట వాళ్ళు ఒక్క మాట అన్నా కూడా తట్టుకోలేక కొట్టావని అంటాడు. నీకు ఇంత కష్టం వచ్చినా చేతకాని వాడిలా అయిపోయానని బాధపడతాడు. ఏదో ఒకటి చేసి నిన్ను బయటకి తీసుకొస్తానని ధైర్యం చెప్పేసి వెళ్ళిపోతాడు. రాజ్ కి నిద్రలో ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటాడు. కావ్యని పిలవలేక తన మీదకి దిండు విసిరేసరికి కావ్య లేచి చూస్తుంది. కంగారుగా ఏమైందని వెంటనే ఇన్ హలర్ కోసం వెతుకుతుంది. కానీ దానిలో మందు అయిపోతుంది. కంగారుగా హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి పైకి లేపుతుంది.


Also Read: మాజీ భార్యకు దగ్గరయ్యేందుకు నందు తిప్పలు- 'గృహలక్ష్మి కిచెన్' ఓపెన్


వాచ్ మెన్ ని పిలిచి కారు తీయమని చెప్తుంది. కానీ తనకి కారు డ్రైవింగ్ రాదని అనేసరికి వాచ్ మెన్ బైక్ తీసుకుని రాజ్ ని వెనుక కూర్చోబెట్టుకుని చీర కొంగుతో తను కింద పడి పోకుండా వీపుకి కట్టుకుని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. ఊపిరి ఆడటం లేదు ఆస్తమాతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని కావ్య డాక్టర్ కి చెప్తుంది. జాయిన్ చేసుకున్నందుకు అడ్వాన్స్ గా 25 వేలు కట్టమని రిసెప్షన్ లో అడుగుతారు. కంగారులో డబ్బులు తీసుకురాలేదని ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని కావ్య బతిమలాడుతుంది. కానీ హాస్పిటల్ రూల్స్ ప్రకారం డబ్బు కట్టిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తామని డాక్టర్ చెప్తాడు. ఆయన దుగ్గిరాల వంశానికి వారసుడు తర్వాత ఎంత అయిన కడతాడని కావ్య ఏడుస్తూ చెప్తుంది. కానీ హాస్పిటల్ వాళ్ళు మాత్రం కుదరదని చెప్తారు. డబ్బు కోసం నిండు ప్రాణాన్ని రిస్క్ లో పెడుతున్నారని వాళ్ళ మీద ఆరుస్తుంది. మానవత్వమే లేదు మీకని ఏడుస్తుంది. అదంతా అద్దంలో నుంచి రాజ్ చూస్తూనే ఉంటాడు. వెంటనే కళ్యాణ్ కి ఫోన్ చేసి అన్నయ్యకి బాగోలేదని చెప్తుంది.