ఇంట్లో మిషన్ అని అబద్ధం చెప్పాను అందుకే ఈ రోజుకి మీ రూమ్ లోనే ఉంటానని మురారీ గోపి దగ్గర ఉండిపోతాడు. తాగుతూ భార్యకి తన ప్రేమని చెప్పలేకపోతున్నందుకు బాధపడతాడు. ముకుందకి అసలు కృష్ణ గురించి ఏం తెలుసు. తను ఎంత మంచిదో. కృష్ణ చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడిందో తెలుసా కళ్ళ ముందే తండ్రిని కోల్పోయింది. అయినా చదువుకుని టాప్ ర్యాంక్ సాధించింది. మా ఇంట్లో పెట్టిన రూల్స్ అన్నీ భరించింది. తన బాధని ఎవరితో పంచుకోలేదు మనసులోనే కుమిలిపోయింది. మా అమ్మ డాక్టర్ గా వద్దంటే ఎందుకని ఎదురు తిరిగి అడగలేదు. పెద్దలంటే గౌరవం అన్నింటికీ మించి తింగరితనం ఎంత క్యూట్ గా ఉంటుందోనని చెప్పుకుని మురిసిపోతాడు.


Also Read: భర్తని చూసి గుండెలు పగిలేలా ఏడ్చిన కావ్య- కోడలిని అపార్థం చేసుకుని నోటికొచ్చినట్టు తిట్టిన అపర్ణ


కృష్ణకి ఫోన్ చేసి ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానని మురారీ అంటాడు. ఆ మాటలు ముకుంద వింటుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసు ఏసీపీ సర్ అంటుంది. ఫుల్ గా తాగేసి ఉన్నారని అనుకుంటుంది. గోపి ఇల్లు తెలుసు కదా వెంటనే ఇక్కడికి వచ్చేయ్ నేను నీకోక నిజం చెప్తాను ఏదీ దాచకుండా అన్నీ చెప్పేస్తానని అంటాడు. ఇప్పుడు డైరీ అమ్మాయి గురించి చెప్తారా? మనసులో ఎంత బాధ ఉంటే ఇలా తాగుతారు. మీకోసం వస్తాను మీరు నా బాధ్యత అనుకుని వస్తానని చెప్తుంది. మురారీ గోపి దగ్గర ఉన్నాడా అయితే అక్కడికి కృష్ణ కంటే ముందే తను వెళ్లాలని ముకుంద అనుకుని బయల్దేరుతుంది. కృష్ణ గురించి మురారీ మాట్లాడుతూ ఉంటే ముకుంద వస్తుంది. తనని చూసి కోపంగా వెళ్లిపొమ్మని అంటాడు. కృష్ణ వస్తుందని గోపి అంటే తెలుసు అందుకే వచ్చానని చెప్తుంది. మురారీతో మాట్లాడాలని ముకుంద అంటే నేను మాట్లాడను తను వెళ్లిపొమ్మని చెప్పు లేదంటే నేనే వెళ్లిపోతానని మురారీ చెప్తాడు. అప్పుడే కృష్ణ రావడం గోపి చూసి చెప్తాడు.


కృష్ణ వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు మురారీతో మాట్లాడి తీరాలని ముకుంద పట్టుబడుతుంది. మాట్లాడాలి అంటుంది కదా అదేదో మాట్లాడి పంపించమని ఈలోపు కృష్ణని మేనేజ్ చేస్తానని గోపి కిందకు వెళతాడు.


మురారీ: ఇప్పుడు ఏంటి కృష్ణకి మన విషయం తెలియాలా? ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావ్


ముకుంద: ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను అనుభవిస్తుంది ఏంటి? నేనంటే నీకు చిరాకు వేస్తుంది, అసహ్యంగా ఉంది కదా


మురారీ: అవును ఎన్ని సార్లు చెప్పినా విసిగిస్తే ఇలాగే ఉంటుంది


ముకుంద: నువ్వు కృష్ణ మాయలో పడిపోయావు అందుకే నేనంటే నచ్చడం లేదు


మురారీ: నేను కృష్ణ మాయలో పడలేదు. తన ప్రేమలో పడ్డాను. ఐలవ్యూ కృష్ణ నా ప్రాణం నీకే


Also Read: మాళవికకి ఇక చుక్కలే, రసవత్తరంగా మారిన కథ- వేదని ఏడిపించిన ఆదిత్య


ముకుంద; నువ్వు ఎంత అరిచినా కృష్ణకి వినిపించదు


కృష్ణని ఆపేందుకు ట్రై చేసి గోపి ఫెయిల్ అవుతాడు. మురారీ ఐలవ్యూ కృష్ణ అని అరుస్తూ ఉంటాడు. కృష్ణ వచ్చేసరికి ఆక్కడ ముకుంద ఉండదు మేడ చివర నిలబడి ఐలవ్యూ కృష్ణ అని అరుస్తాడు. అది చూసి కంగారుపడుతుంది. మత్తు ఎక్కువై సోఫాలో పడిపోతాడు. డైరీ అమ్మాయి కనిపిస్తే ఏమవుతుందోనని కృష్ణ టెన్షన్ పడుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఏసీపీ సర్ భార్యని మమ్మల్ని ఎవరూ విడదీయలేరని అనుకుంటుంది. మత్తులో ఉన్న మురారీని నిద్రలేపుతుంది. కృష్ణ మాటల ద్వారా ముకుందని చూడలేదని అర్థం చేసుకుంటాడు.