వర్షాకాలం వచ్చేసింది.. రోగాలు తెచ్చేస్తుంది. ఈ సీజన్ లో ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి ఉంటుంది. టవల్స్, దిండ్లు పంచుకోవడం, వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈజీగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చెందుతాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం, చెమటతో కూడిన చర్మంపైకి శిలీంధ్రాలు చెరిపోయి ఇన్ఫెక్షన్స్ కి దారి తీస్తుంది. వాన వల్ల బయట తడి వాతావరణం, అపరిశుభ్రత కూడా వ్యాప్తిని పెంచుతుంది. దద్దుర్లు, అథ్లెట్ ఫుట్ వంటి అనేక చర్మ సమస్యలు మండే వేసవిలో మాత్రమే కాదు తేమ వాతావరణంలో కూడా బ్యాక్టీరియా చురుకుగా పని చేస్తుంది. అవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి దారి తీసే అవకాశం ఉంది. వాటిని ఎదుర్కొనేందుకు మార్కెట్లో యాంటీ ఫంగల్ క్రీమ్స్ లభిస్తాయి. కానీ వాటికంటే ఇంటి నివారణలు మంచిదని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.


అథ్లెట్ ఫుట్


దీన్నే టినియా పెడియాస్ అని కూడా అంటారు. ఇదొక ఫంగల్ ఇన్ఫెక్షన్. పాదాలపై ఉన్న చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. గోళ్ళపై త్వరగా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిని నేరుగా కలుసుకుని తాకడం లేదంటే వాళ్ళు తాకిన వస్తువులు ముట్టుకున్నా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో ఈ ఫంగస్ వృద్ధి చెందుతుంది.


లక్షణాలు


⦿ దురద


⦿ ఏదో కుట్టినట్టుగా అనుభూతి


⦿ బర్నింగ్ సెన్సేషన్ 


⦿ బొబ్బలు


⦿ కాలి పగుళ్లు


⦿ గోళ్ళు విరిగిపోవడం


రింగ్ వార్మ్


వర్షాకాలంలో వచ్చే అత్యంత సాధారణ ఇన్ఫెక్షన్లో ఇదీ ఒకటి. చర్మం బయటి పొరలోని కణాలపై నివసించే పరాన్నజీవుల వల్ల కలిగే అత్యంత అంటు వ్యాధి. రింగ్వార్మ్ వల్ల చర్మంపై గుండ్రని, పొలుసుల ప్యాచెస్ ఏర్పడతాయి. ఇది నిరంతరం దురద పెడుతుంది. పొక్కుల వంటి గాయాల్ని ఏర్పరుస్తుంది. చర్మం రంగు ఎర్రగా మారుతుంది. తీవ్రమైన అనారోగ్యానికి కారణమయ్యే ఫంగల్ ఇన్ఫెక్షన్ చర్మం ఉపరితలం కింద వ్యాపించనప్పటికీ బలహీనమైన రోగనిరోధక ష్టకహి ఉన్నవారు దీని నుంచి బయట పడటం కష్టం.


ఇంటర్ ట్రిగో


ఇంటర్ ట్రిగో లేదా ఇంటర్ ట్రిజినస్ డెర్మటైటిస్ అనేది సాధారణంగా చర్మం మడతల్లో ఏర్పడుతుంది. ఎక్కువగా వేడి, తేమ, రాపిడి జరగడం వల్ల తీవ్రతరం అవుతుంది. కాండిడా లేదా శిలీంధ్రాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ద్వారా ఇది మరింత తీవ్రమవుతుంది.


లక్షణాలు


⦿ దురద


⦿ మంట


⦿ చర్మం మడతలో ఏదో కుట్టినట్టుగా అనిపించడం


⦿ దుర్వాసన


⦿ వాపు


⦿ పొలుసుల చర్మం


టినియా కాపిటిస్


హెర్పేస్ టోన్సురాన్స్ ఇన్ఫెక్షన్ అని కూడా పిలుస్తారు. ఇది వెంట్రుకల చర్మంపై సంభవిస్తుంది. డెర్మాటోఫైట్ జాతులు మైక్రోస్పోరమ్, ట్రైకోఫైటన్ వల్ల వస్తుంది. ఈ శిలీంధ్రాలు హెయిర్ ఫోలికల బయట రూట్ లో చొచ్చుకుపోతాయి. చివరికి జుట్టు సాఫ్ట్ పై దాడి చేస్తాయి. దీని వల్ల మంట, అలోపేసియా కూడా వస్తుంది.


అందుకు కారణాలు ఇవే..


⦿ బట్టతల మచ్చలు


⦿ జుట్టు పెళుసుగా మారిపోవడం


⦿ చర్మం చుట్టు వాపు


⦿ చీముతో నిండిన బాధకరమైన పుండ్లు


⦿ జుట్టు శాశ్వతంగా కోల్పోవడం


ఈస్ట్ సంక్రమణ


కాండిడా అని కూడా పిలుస్తారు. ఈ ఇన్ఫెక్షన్ పేలవమైన వెంటిలేషన్, తేమ ఉన్న ప్రాంతాల్లో వృద్ధి చెందుతుంది. పిరుదుల మడతలు, రొమ్ముల కింద ప్రాంతాల్లో వస్తుంది. తీవ్రమైన దురద, మొటిమల వంటి గడ్డలు ఏర్పడతాయి.


ఫంగల్ ఇన్ఫెక్షన్ నిరోధించే మార్గాలు


☀ ప్రతిరోజూ పాదాలు సబ్బు, నీటితో కడగాలి. కాలి వేళ్ళ మధ్య చర్మం పొడిగా ఉండేలా చూసుకోవాలి.


☀ హెయిర్ బ్రష్, సాక్స్, షూస్ లేదా టవల్స్ వంటి వాటిని ఎప్పుడు ఇతరులతో షేర్ చేసుకోవద్దు


☀ వదులుగా, కాటన్ తో తయారు చేసిన సాక్స్ వాడటం మంచిది


☀ తడి బూట్లు ఎప్పుడు వేసుకోవద్దు


☀ బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు


☀ స్నానం చేసేటప్పుడు గోళ్ళు కింద ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి


☀ క్యూటికల్స్ ఎప్పుడూ కత్తిరించకూడదు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఈ ఆహారాలు తిన్నారంటే ఫుల్ ఎనర్జీ - అలసటనేది ఉండదు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial