అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హిందీ చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. తల్లి మీద ప్రేక్షకుల్లో ఉన్న అభిమానానికి తోడు తండ్రి బోనీ కపూర్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఆ తర్వాత ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అండదండలు ఉండటంతో అవకాశాలు సులభంగా వస్తున్నాయని చాలా విమర్శలు ఉన్నాయి. నటిగా, అందగత్తెగా జాన్వీ కపూర్ ప్రేక్షకుల్ని మెప్పించినా విజయాలే ఆశించినంతగా రావడం లేదు. లేటెస్టుగా జాన్వీ కపూర్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరినట్టు హిందీ క్రిటిక్స్ రివ్యూస్ బట్టి తెలుస్తోంది.


'ఉల్జా' బాలేదా? జాన్వీ కపూర్ కోసమే రాశారా?
జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉల్జా' (Bollywood Movie Ulajh) ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైంది. ఇందులో గుల్షన్ దేవయ్య మరో రోల్ చేశారు. ఈ సినిమాకు బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి గొప్ప రివ్యూలు ఏమీ రాలేదు. కొంత మంది 3 రేటింగ్ ఇచ్చినప్పటికీ... మెజారిటీ క్రిటిక్స్ 1.5 నుంచి 2 వరకు రేటింగ్స్ ఇచ్చారు. ఆడియన్స్ నుంచి సైతం ఆశించిన స్పందన కరువైంది (Ulajh Movie Review Ratings).


థియేటర్లలో 'ఉల్జా' కంటే ముందు 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' వచ్చింది. అదీ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఎక్కువ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన 'బవాల్' విమర్శకులతో పాటు ప్రేక్షకుల్ని మెప్పించినా సరే... అంతకు ముందు కూడా చెప్పుకోదగ్గ భారీ విజయాలు జాన్వీ కపూర్ ఖాతాలో లేవు. దాంతో ఇప్పుడు ఆవిడ ఆశలు అన్నీ 'దేవర' మీద ఉన్నాయని చెప్పాలి. 


'దేవర'తో జాన్వీకి నెక్స్ట్ లీగ్ ఎంట్రీ!
Janhvi Kapoor pins her hopes on Devara movie: జాన్వీ కపూర్ అందానికి, ఆమె నటనకు హిందీలో అభిమానులు ఉన్నాయి. దర్శక నిర్మాతలు సైతం ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు. అయితే... వరుణ్ ధావన్, రాజ్ కుమార్ రావు వంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. కానీ, స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్సులు ఆమెకు రాలేదు.


Also Read: తిరగబడర సామీ రివ్యూ: రాజ్ తరుణ్ ఇటువంటి సినిమాలు చేస్తే కెరీర్ తిరగబడుతుంది సామీ... డేంజర్ బెల్స్ మోగించిన డిజాస్టర్



జాన్వీకి వచ్చిన ఫస్ట్ భారీ బడ్జెట్ సినిమా 'దేవర'. ఇందులో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా ఆమె నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఫస్ట్ స్ట్రెయిట్ సినిమా కూడా ఇదే. దీని తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జోడీగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించే సినిమా కూడా ఆమెకు వచ్చింది. అయితే... చరణ్ సినిమా కంటే ముందు భారీ హిట్ అందుకోవాల్సిన అవసరం ఆమె మీద ఉంది. అప్పుడు సౌత్ హీరోలు తీసే పాన్ ఇండియా సినిమాలకు జాన్వీ కపూర్ ఫస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అందుకని, ఆవిడ కూడా ఎన్టీఆర్ 'దేవర' మీద చాలా ఆశలు పెట్టుకుందని బాలీవుడ్ ఖబర్.


Also Readబృంద రివ్యూ: Sonyliv OTTలో త్రిష వెబ్ సిరీస్ - సౌత్ క్వీన్ ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?