Jr NTR New Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. ఆ మూడూ అఫీషియల్! అయితే, ఆల్రెడీ మరో రెండు సినిమాలు చేసేందుకు ఆయన 'ఎస్' అని చెప్పారని టాలీవుడ్ టాక్. ఒక్కటంటే ఒక్క సినిమా తీసిన దర్శకుడితో భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఫ్రాంచైజీ చేసేందుకు రెడీ అవుతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళితే... 


'హాయ్ నాన్న' దర్శకుడితో ఎన్టీఆర్ రెండు సినిమాలు!
Jr NTR is in talks with Hi Nanna director Shouryuv for a two-part film: న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన 'హాయ్ నాన్న' సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయనతో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారని, ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయనేది తెలిసిన విషయమే. అయితే... ఇప్పుడు ఆ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏమిటంటే... రెండు పార్టులుగా ఆ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. 


శౌర్యువ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కబోయేది భారీ యాక్షన్ డ్రామా అని తెలిసింది. అందులో ఫస్ట్ పార్ట్ 2026లో సెట్స్ మీదకు వెళుతుందట. ఆ సినిమాను 2028లో విడుదల చేయనున్నారట. ఇక, రెండో పార్ట్ 2031లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దీని బట్టి... 2030 వరకు ఎన్టీఆర్ షెడ్యూల్ బిజీ అనుకోవాలి.


ప్రజెంట్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల స్టేటస్ ఏంటి?
Jr NTR Upcoming Pan India Movies: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. ఇది పాన్ ఇండియా రిలీజ్. ఇదొక్కటే కాదు, 'ఆర్ఆర్ఆర్' తర్వాత మన దేశంలో, విదేశాల్లో ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ నేపథ్యంలో ఇక నుంచి రాబోయే ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.


Also Read: ప్రభాస్ కోసం వెనక్కి తగ్గిన మంచు మనోజ్, తేజా సజ్జా - 'రాజా సాబ్' వెనుక 'మిరాయ్' రిలీజ్ డౌటే!



'దేవర' తర్వాత తన ఫస్ట్ బాలీవుడ్ స్ట్రయిట్ సినిమా 'వార్ 2'తో ఎన్టీఆర్ ప్రేక్షకులు ముందుకు వస్తారు. హృతిక్ రోషన్, ఆయన కలసి నటిస్తున్న ఆ స్పై సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. 'దేవర' పార్ట్ 1 విడుదల అయ్యాక... 'కేజీఎఫ్', 'సలార్' సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళతారు ఎన్టీఆర్. ఆ సినిమాకు 'డ్రాగన్' టైటిల్ ఖరారు చేశారని టాక్. కానీ, అధికారికంగా చెప్పలేదు. ఆ సినిమా 2026లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.


Also Readచిరు, పవన్, చరణ్ కోసం కథ రాస్తున్న దర్శకుడు - మెగా మల్టీస్టారర్ వర్కవుట్ అయ్యేనా?



ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' తర్వాత నుంచి శౌర్యువ్ దర్శకత్వంలో సినిమాలు సెట్స్ మీదకు వెళతాయి. మధ్యలో 'దేవర' పార్ట్ 2 కూడా చేయాలి. ఎన్టీఆర్ భారీ యాక్షన్ సినిమాలు చేయడం అభిమానులకు సంతోషం కలిగించే అంశమే. అయితే, ప్రతి రెండు సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువ లేకుండా చూసుకోవాలని, ఏడాదికి ఒక్క సినిమా అయినా సరే థియేటర్లలోకి రావాలని కోరుకుంటున్నారు.