టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మూల పురుషుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఆయన తర్వాత చాలా మంది హీరోలు వచ్చారు. ఇప్పుడు మెగా, అల్లు ఫ్యామిలీలలో చాలా మంది హీరోలు ఉన్నారు. అందరూ కలిస్తే క్రికెట్ టీమ్ రెడీ అవుతుందని కొందరు చెప్పే మాటలు నిజమే. మెగా హీరోలు కలిసి మల్టీస్టారర్ చేస్తే? మెగా ఫ్యామిలీలో మెయిన్ హీరోలు కలిసి సినిమా చేస్తే? ఒకవేళ వాళ్ళు చేయాలని అనుకున్నా... కథ రాసే రచయిత, సినిమా తీసే దర్శకుడు ఉన్నారా? అంటే ఒకరు ఆ దిశగా కృషి చేస్తున్నారు.


మెగా మల్టీస్టారర్... హరీష్ శంకర్!
మెగా ఫ్యామిలీ అభిమానుల్లో కమర్షియల్ పల్స్ తెలిసిన దర్శకుడు, భాష మీద పట్టున్న రచయిత హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. తాను పవర్ స్టార్ భక్తుడిగా ప్రకటించుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా 'గబ్బర్ సింగ్', అల్లు అర్జున్ హీరోగా 'దువ్వాడ జగన్నాథం డీజే', వరుణ్ తేజ్ హీరోగా 'గద్దలకొండ గణేష్', సాయి ధరమ్ తేజ్ హీరోగా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' తీశారు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన 'మిస్టర్ బచ్చన్' విడుదలకు రెడీగా ఉంది. 


ఆగస్టు 15న 'మిస్టర్ బచ్చన్' థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ మెయిన్ హీరోలతో మల్టీస్టారర్ కోసం లైన్ రెడీ చేశానని హరీష్ శంకర్ చెప్పారు.






హరీష్ శంకర్ తీసిన సినిమాల్లో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే, ఆయన ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా తీయలేదు. ఆ విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తే... ''పాన్ ఇండియా కోసం అని కథ రాయలేం. 'పుష్ప' పాన్ ఇండియా సినిమా అని తీయలేదు. 'కాంతార' పాన్ ఇండియా కోసం చేయలేదు. వాళ్ళ మట్టి కథను చెప్పారు. పాన్ ఇండియా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సహజసిద్ధంగా అలా జరగాలి. నేను కళ్యాణ్ గారు, రామ్ చరణ్, చిరంజీవి గారు... ఈ ముగ్గురి కోసం ఒక లైన్ ఎప్పటి నుంచో వర్కవుట్ చేస్తున్నాను. చేస్తే... అన్ని పాన్ ఇండియాల కంటే అదే పాన్ ఇండియా అవుతుంది'' అని హరీష్ శంకర్ తెలిపారు. ఆ కథ, సినిమా వర్కవుట్ కావాలని ఆశిద్దాం.


Also Readహరీష్ శంకర్ vs టాలీవుడ్ మీడియా... స్టార్టింగ్ to 'మిస్టర్ బచ్చన్' వరకు - ఏం జరిగిందో తెల్సా?



చిరంజీవి తర్వాత ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ఇప్పుడు చిరు వారసుడిగా రామ్ చరణ్ (Ram Charan), నాగబాబు వారసుడిగా వరుణ్ తేజ్, మెగా మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్, ఆయన తర్వాత తమ్ముడు వైష్ణవ్ తేజ్ వచ్చారు. కొన్ని రోజులు ఆగితే పవన్ కుమారుడు అకిరా నందన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరితో ఎవరు సినిమా చేసినా క్రేజ్ మామూలుగా ఉండదు. 'బ్రో' సినిమాలో పవన్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. చిరంజీవి 'శంకర్ దాదా'లో పవన్, రామ్ చరణ్ 'బ్రూస్ లీ', 'మగధీర' సినిమాల్లో చిరు అతిథి పాత్రల్లో సందడి చేశారు. అయితే ఇప్పటి వరకు పక్కా మెగా మల్టీస్టారర్ రాలేదు.


Also Read: ధనుష్‌కు అండగా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ - తమిళ నిర్మాతలు, హీరో గొడవ ముదురుతోందా?