హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహించిన తాజా సినిమా 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan Movie). ఆగస్టు 15న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ రీసెంట్‌గా విడుదల చేశారు. అయితే... టీజర్ కంటే సోషల్ మీడియాలో హరీష్ శంకర్, ఓ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్ట్ మధ్య జరిగిన డిస్కషన్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ మీడియాకు, ఈ దర్శకుడికి మధ్య ఇటువంటి చర్చలు జరగడం కొత్త కాదు. ఇంతకు ముందు కూడా జరిగాయి. అసలు ఈ చర్చ మొదలైంది ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చింది? అనేది చూస్తే...


ఉస్తాద్ భగత్ సింగ్... ఆవేశం తగ్గించుకుంటే మంచిది!
మాస్ మహారాజా రవితేజతో 'మిస్టర్ బచ్చన్' కంటే ముందు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు హరీష్ శంకర్. అయితే... పవన్ రాజకీయ ప్రయాణం వల్ల ముందుగా చేసిన ప్లానింగ్ కంటే ఆ సినిమా ఆలస్యం అవుతుండటంతో 'మిస్టర్ బచ్చన్' మొదలు పెట్టాల్సి వచ్చింది. 






హరీష్ శంకర్ సినిమాల గురించి ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేయగా... అవి తప్పు అంటూ సదరు దర్శకుడు రిప్లై ఇచ్చారు. డిసెంబర్ నెలలో 'మిస్టర్ బచ్చన్' మొదలైన తర్వాత సేమ్ డిస్కషన్ తెరపైకి వచ్చింది. అప్పుడు హరీష్ శంకర్ ''మేం కొత్త సినిమా జనవరిలో మొదలు పెట్టాలని అనుకోలేదు. డిసెంబర్ అని ముందు ఫిక్స్ అయ్యాం. అందుకే తప్పు అని చెప్పా'' అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు సేమ్ జర్నలిస్ట్ 'మిస్టర్ బచ్చన్' నైజాం డిస్ట్రిబ్యూషన్ రేట్ గురించి ట్వీట్ చేయగా... తమ వివరాలు లీక్ చేయడం మీద ఫైర్ అయ్యారు.






జర్నలిస్టును ముసలి నక్క అని పేర్కొన్న హరీష్ శంకర్!
'మిస్టర్ బచ్చన్' నైజాం రైట్స్ గురించి ట్వీట్ చేయడం కంటే ముందు సదరు జర్నలిస్ట్... 'సితార్' సాంగ్ ప్రోమో విడుదలైన తర్వాత హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే బ్యాక్ మీద రవితేజ చేయి వేసిన స్టెప్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. దాంతో హరీష్ శంకర్ తీవ్రమైన పదజాలంతో ట్వీట్‌ చేశారు. తన కంటే సగం వయసు కూడా లేని హీరోయిన్లతో రవితేజ రొమాన్స్‌ చేస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటికి ఊతం ఇచ్చేలా ఆ స్క్రీన్‌ షాట్‌ ఉందని పలువురు భావించారు.






సదరు జర్నలిస్టును ముసలి నక్క అని పేర్కొన్నారు. సినిమా  విడుదల దగ్గర పడిందని తగ్గుతానని అనుకుంటున్నారేమో, విడుదలకు ఒక్క రోజు ముందు కూడా తగ్గనని ట్వీట్ చేశారు. అప్పట్లో అది హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత రైట్స్ విషయంలో మరోసారి జర్నలిస్ట్, హరీష్ శంకర్ మధ్య ట్విట్టర్ వేదికగా డిస్కషన్ జరిగింది. అయితే, తర్వాత అదే జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చారనుకోండి. అది వేరే విషయం!


సురేష్ కొండేటి ప్రస్తావనతో మరోసారి వార్తల్లో హరీష్!
'మిస్టర్ బచ్చన్' టీజర్ విడుదల కార్యక్రమంలో సోషల్ మీడియాలో పలువురిని బ్లాక్ చేస్తున్న విషయాన్ని మరో మీడియా సంస్థకు చెందిన జర్నలిస్ట్ ప్రస్తావించగా... ఓ వేడుకలో సుమ గారి చేత సారీ చెప్పిన మీడియా, 'డీజే టిల్లు' టీజర్ విడుదల కార్యక్రమంలో పుట్టుమచ్చల గురించి సురేష్ కొండేటి అడిగినప్పుడు ఎందుకు సారీ చెప్పించలేదని ఎదురు ప్రశ్నించారు. దాంతో సదరు మీడియా సంస్థ తమను టార్గెట్ చేయడం సరికాదని ట్వీట్ చేసింది. వాళ్లకు మద్దతుగా కొందరు మీడియా మిత్రులు ట్వీట్ చేశారు. ప్రేక్షకులు కొందరు విమర్శించారు. 


సురేష్ కొండేటికి '2018'లో కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్!
సురేష్ కొండేటి గురించి ప్రస్తావన రావడం కాదు... సురేష్ కొండేటికి డైరెక్టుగా ఓ సినిమా విలేకరుల సమావేశంలో హరీష్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. మలయాళ బ్లాక్ బస్టర్ '2018'ని తెలుగులో విడుదల చేయగా... ఓ ప్రెస్‌మీట్‌కు హరీష్ శంకర్ వచ్చారు.


Also Read: 25 ఏళ్ల అమ్మాయితో 56 ఏళ్ల రవితేజ రొమాన్స్ - మిస్టర్ బచ్చన్ సాంగ్ ట్రోలర్‌కు ఇచ్చి పారేసిన హరీష్ శంకర్



తెలుగు దర్శకులు ఈ విధంగా సినిమా తీయగలరా? అని '2018'ని తెలుగులో విడుదల చేసిన 'బన్నీ' వాసును సురేష్ కొండేటి ప్రశ్నించారు. అప్పుడు హరీష్ శంకర్ మైక్ తీసుకుని ఏం చెప్పారో... కింద వీడియోలో చూడవచ్చు.



మీడియా ముందు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు... తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేసే దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. సినిమాటోగ్రాఫ్ ఛోటా కె నాయుడు తన గురించి విమర్శలు చేసినప్పుడు స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద వచ్చిన విమర్శలకు అంతే ధీటుగా ట్వీట్స్ చేశారు. ఎటువంటి మొహమాటాలు ఆయనకు ఉండవు. ముక్కుసూటిగా వ్యవహరించడం, తాను చెప్పాలనుకున్నది చెప్పడం, చెప్పిన మాట మీద నిలబడటం ఆయన నైజం. సోషల్ మీడియాలో ట్రోల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు... ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' సినిమాకు ప్రచారం తీసుకు వస్తున్నాయి.  



Also Readమిస్టర్ బచ్చన్' రిలీజ్ డేట్ ఫిక్స్ - బాక్సాఫీస్ బరిలో విక్రమ్ vs రవితేజ vs రామ్