యువ కథానాయకుడు అశ్విన్ బాబు (Ashwin Babu) నటించిన తాజా సినిమా 'శివం భజే' (Shivam Bhaje Movie). అప్సర్ దర్శకత్వం వహించారు. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాను నైజాంలో మైత్రి సంస్థ తీసుకుంది.


నైజాంలో మైత్రి చేతికి 'శివం భజే'
Shivam Bhaje Movie Nizam Distributor: 'శివం భజే' ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అలాగే, ఒక సాంగ్ విడుదల చేశారు. దానికీ పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించడంతో సినిమాకు క్రేజ్ లభించింది. దాంతో ఈ సినిమాను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ఎల్.ఎల్.పి  వంటి అగ్ర నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది.


Also Read: దేవర లీక్స్ షేర్ చేశారో అంతే సంగతులు - సోషల్ మీడియా అకౌంట్స్ లేచిపోతాయ్






Shivam Bhaje Trailer Review In Telugu: ఆల్రెడీ విడుదలైన 'శివం భజే' ట్రైలర్ చూస్తే... టెర్రరిజం, మర్డర్ మిస్టరీ, భూమి మీదకు శివుని రాక వంటివి మేళవించి సినిమా తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. అయితే... సీక్రెట్ ఏజెంట్ ఎవరు? ఆ తీవ్రవాదుల ఆటను కట్టించింది ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది ఒక న్యూ ఏజ్ థ్రిల్లర్ అని దర్శక నిర్మాతలు తెలిపారు. కథ, కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండబోతున్నాయని ప్రేక్షకులు సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు, అప్సర్ దర్శకత్వం... ప్రతిదీ సినిమాలో హైలెట్ కానుందని టాక్.


Also Readరాయన్ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ - బయటకు వెళ్లకుండా సొంత ప్లాట్‌ఫార్మ్‌కు ఇచ్చిన నిర్మాతలు



Shivam Bhaje Movie Cast And Crew: 'శివం భజే' సినిమాలో అశ్విన్ బాబు సరసన ఉత్తరాది భామ దిగంగనా సూర్యవంశీ (Digangana Suryavanshi) కథానాయికగా నటించారు. ఇందులో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ విలన్. ఇంకా ఈ సినిమాలో 'హైపర్' ఆది, మురళీ శర్మ, సాయి ధీనా, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, 'షకలక' శంకర్, కాశీ విశ్వనాథ్, 'బిగ్ బాస్' ఫేమ్ ఇనాయ సుల్తానా ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, సంగీత దర్శకుడు: వికాస్ బడిస, ఫైట్ మాస్టర్: పృథ్వీ - రామకృష్ణ, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, నిర్మాణ సంస్థ: గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి, రచన - దర్శకత్వం: అప్సర్.