మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియా సినిమా 'దేవర' (Devara Movie). ఇందులో ఆయన లుక్ ఎలా ఉంటుంది? అనేది ఆడియన్స్‌కు తెలుసు. ఆల్రెడీ ఫస్ట్ లుక్, ఫియర్ సాంగ్ రిలీజ్ చేశారు. అసలు, విషయం ఏమిటంటే? సినిమాలో ఎన్టీఆర్ రెండు లుక్స్‌లో సందడి చేయనున్నారు. ఆ రెండో లుక్ లేటెస్టుగా లీక్ అయ్యింది.
నెట్టింట చక్కర్లు కొడుతున్న ఎన్టీఆర్ సెకండ్ లుక్!
NTR Second Look From Devara Leaked: అవును... 'దేవర' నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ (Man Of Masses NTR) సెకండ్ లుక్ లీక్ అయ్యింది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సిటీలో జరుగుతోంది. సెట్స్ నుంచి ఎవరో ఫోటోలు తీసి రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే... ఆ లుక్ సోషల్ మీడియాలో షేర్ చేశారో అంతే సంగతులు. మీ అకౌంట్లు లేచిపోతాయ్. ఈ మేరకు సోషల్ మీడియాలో హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. అదీ సంగతి!
'దేవర' చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుంచి సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. తొలుత సెట్స్ ఫోటోలు, ట్యాంకర్ల ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ తర్వాత మరికొన్ని పిక్స్ వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ రెండో లుక్ లీక్ అయ్యింది. ఒక్కటి మాత్రం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది... లీక్ పక్కన పెడితే ఆ లుక్ బాగా నచ్చింది.
Also Read: రాయన్ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ - బయటకు వెళ్లకుండా సొంత ప్లాట్‌ఫార్మ్‌కు ఇచ్చిన నిర్మాతలు
సెప్టెంబర్ 27వ తేదీ నుంచి థియేటర్లలో 'దేవర'
Devara Movie Release Date: 'దేవర'ను తొలుత ఒక సినిమాగా సెట్స్ మీదకు తీసుకు వెళ్లినప్పటికీ... రెండు భాగాలుగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. ఆగస్టు నుంచి పాటలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. సినిమా యూనిట్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఫ్యాన్స్ ప్రెజర్ మాత్రం ఉంది.
Also Read: శృతి హాసన్ @ 15 - ఐరన్ లెగ్ నుంచి పాన్ ఇండియా గోల్డెన్ లెగ్ వరకు... జర్నీ అంత ఈజీ కాదు బాస్
'దేవర'లో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా... సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. మరో విలన్ క్యారెక్టర్ కోసం 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ (Bobby Deol)ను ఎంపిక చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కె హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.