Raayan OTT And Satellite Rights Details: తమిళ చిత్రసీమలో అగ్ర హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన నటుడు ధనుష్. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా సినిమా 'రాయన్' (Raayan Movie). ఈ రోజు (జూలై 26, శుక్రవారం) థియేటర్లలోకి వచ్చింది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరి, 'రాయన్' ఓటీటీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా?


సన్ నెక్స్ట్ ఓటీటీకి 'రాయన్'...
బయటకు ఇవ్వని నిర్మాతలు!
'రాయన్' సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఇది సన్ టెలివిజన్ నెట్వర్క్ సంస్థ. వాళ్లకు సొంత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ ఉంది. 'రాయన్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంత ఓటీటీ సంస్థ కోసం ఉంచారు. ఇతర ఓటీటీ వేదికలకు అమ్మలేదు.


తెలుగు, తమిళ భాషల్లో సన్ నెక్స్ట్ (Sun Nxt OTT)లో 'రాయన్' స్ట్రీమింగ్ కానుంది. శాటిలైట్ రైట్స్ కూడా సన్ టీవీకి ఇచ్చారు. సొంత టీవీ, ఓటీటీ నెట్వర్క్ ఉండటం ఈ విధంగా ప్లస్ కూడా కానుంది.


Also Read: శృతి హాసన్ @ 15 - ఐరన్ లెగ్ నుంచి పాన్ ఇండియా గోల్డెన్ లెగ్ వరకు... జర్నీ అంత ఈజీ కాదు బాస్






రెండు భాషల్లోనూ 'రాయన్'కు సూపర్ హిట్ టాక్!
Raayan Gets Super Hit Talk On Release Day: ధనుష్ ప్రయాణంలో 'రాయన్' వెరీ స్పెషల్ ఫిల్మ్. ఆయన 50వ చిత్రమిది. పైగా దీనికి రచయిత, దర్శకుడు కూడా ధనుషే. సోలో హీరో సినిమాగా తీయకుండా, తనకు జోడీగా హీరోయిన్ ఎవరూ లేకుండా ఆయన సినిమా తీశారు. స్టైలిష్ లుక్ వైపు వెళ్లకుండా షార్ట్ హెయిర్ కట్ (ఆల్మోస్ట్ గుండుతో అని చెప్పవచ్చు)తో సాధారణంగా కనిపించారు.


Also Readబ్లడీ ఇష్క్ రివ్యూ - Hotstarలో అవికా గోర్ హారర్ ఫిల్మ్ - ఈ ఎఫైర్స్ ఏంటి డాడీ బ్రో?



సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్, ఎస్.జె. సూర్యలకు కీలక పాత్రలు ఇచ్చారు ధనుష్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాకు సూపర్ డూపర్ పాజిటివ్ హిట్ టాక్ లభించింది. థియేటర్లలో విడుదలైన 56 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల అయ్యేలా చూడాలని తమిళనాడులో అనధికారికంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య అగ్రిమెంట్ నడుస్తోంది. మరి, ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుందో చూడాలి.