షమ్ము (Shammu) కథానాయకుడిగా హరీష్ మధు రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ చిత్రాన్ని సప్తాశ్వ ప్రొడక్షన్స్ సంస్థ రూపొందిస్తోంది. యువ సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'క్రేజీ రాంబో' (Crazy Rambo Telugu Movie) టైటిల్ ఖరారు చేశారు. యువ హీరో అశ్విన్ బాబు (Ashwin Babu) చేతుల మీదుగా ఆ టైటిల్ విడుదల కార్యక్రమం జరిగింది.


అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్
'క్రేజీ రాంబో' చిత్రాన్ని ది అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత ర్యాప్ రాక్ షకీల్ (Rap Rock Shakeel) తెలిపారు. సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్లు ఆయన వివరించారు. సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభిస్తామని, అప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.


'క్రేజీ రాంబో' టైటిల్ లాంచ్ అనంతరం ఆ కార్యక్రమంలో హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ... ''ముందు ఈ సినిమా టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ, సన్నివేశాలు సైతం టైటిల్‌కు తగ్గట్టు క్రేజీగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. పెద్ద హిట్ అవ్వాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.


Also Read: దేవర లీక్స్ షేర్ చేశారో అంతే సంగతులు - సోషల్ మీడియా అకౌంట్స్ లేచిపోతాయ్



'క్రేజీ రాంబో' గురించి 'ర్యాప్ రాక్' షకీల్ మాట్లాడుతూ... ''కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాన్స్‌... అన్ని భావోద్వేగాలు, హంగులు ఉన్న రోలర్ కోస్టర్ రైడ్‌ మా 'క్రేజీ రాంబో'. ఇందులో హీరో షమ్ము టైటిల్ రోల్ చేస్తున్నాడు. దర్శకుడు మధు గారు కథ చెప్పినప్పుడు నాకు ఎంతో నచ్చింది. దాంతో మా తమ్ముడు షమ్ము హీరోగా ఈ సినిమాను నేనే నిర్మించాలని అనుకున్నా. మంచి కంటెంట్ బేస్డ్ సినిమా ఇది. హీరోది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మా సినిమాలో  స్క్రీన్‌ ప్లే, డైలాగులు కొత్తగా ఉంటాయి. ఇక, సంగీతం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది'' అని చెప్పారు. ఈ సినిమాకు 'ర్యాప్ రాక్' షకీల్ సంగీతం అందిస్తున్నారు.


Also Readరాయన్ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ - బయటకు వెళ్లకుండా సొంత ప్లాట్‌ఫార్మ్‌కు ఇచ్చిన నిర్మాతలు



షమ్ము మాట్లాడుతూ... ''కథానాయకుడిగా నా మూడో చిత్రమిది. మా అన్నయ్య నిర్మాణంలో నేను హీరోగా సినిమా చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. పేరుకు తగ్గట్టు ఈ 'క్రేజీ రాంబో' కథ చాలా క్రేజీగా ఉంటుంది. ప్రేక్షకులు అందరినీ అలరిస్తుంది'' అని చెప్పారు.


Crazy Rambo Telugu Movie Cast And Crew: షమ్ము హీరోగా సప్తాశ్వ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ మధు రెడ్డి రచన, దర్శకత్వంలో 'ర్యాప్ రాక్' షకీల్ ప్రొడ్యూస్ చేస్తున్న 'క్రేజీ రాంబో' చిత్రానికి సినిమాటోగ్రఫీ:  జైపాల్ రెడ్డి, సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ - బాష్య శ్రీ, స్టైలింగ్: భవ్య నీలిమ, సంగీతం: 'ర్యాప్ రాక్' షకీల్.