Niharika Konidela: అల్లు అర్జున్‌ నంద్యాల వెళ్లడంపై నిహారిక రియాక్షన్‌ - అప్పుడు ఇంట్లో అంతా ఇదే అన్నారు..

Mega-Allu Family Disputes: ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌ నంద్యాల వెళ్లడంపై నిహారిక షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. బన్నీ అలా చేయడంతో ఇంట్లో వాళ్లంతా ఇలా అనుకున్నారంటూ అసలు విషయం చెప్పింది. 

Continues below advertisement

Niharika Konidela React on Allu Arjun Nandyal Visit: ఏపీ ఎన్నికలు ముగిశాయి. కూటమి భారీ మెజారిటీతో గెలిచింది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక మెగా ఫ్యామిలీ అంతా తమ తమ వర్క్‌తో బిజీ అయిపోయింది. కానీ ఈ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పటికే హాట్‌టాపిక్‌గానే ఉంది. అదే అల్లు అర్జున్‌ నంద్యాల్‌ పర్యటన. ఎన్నికల ప్రచారంలో ఆయన తన బంధువు పవన్‌ కళ్యాణ్‌కి కాకుండ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరపున ప్రచారం చేశారు.

Continues below advertisement

అప్పట్లో ఇది సంచలనంగా మారింది. ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. అప్పటి నుంచి అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య భేదాభ్రియాలు వచ్చాయంటూ రూమర్స్‌ వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కూడా అవుననే సమాధానాలే గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో అల్లు-మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ ఎక్కడ కనిపించిన విలేఖర్ల నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. బన్నీ నంద్యాల పర్యటనతో ఇంట్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని, వీటి వల్ల రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. తాజాగ మెగా డాటర నిహారికకు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది.

ఆమె నిర్మిస్తున్న కమిటీ కుర్రాళ్లు మూవీ రిలీజ్‌ నేపథ్యంలో ఆమె వరుస ఇంటర్య్వూలతో బిజీ అయిపోయింది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నిహారికకు అల్లు అర్జున్‌ నంద్యాల వెళ్లడంపై ప్రశ్న ఎదురైంది. ఎన్నికల్లో ఫ్యామిలీ అంతా ఒకవైపు కాకుండా ఒక్కొక్కరు ఓవైపు ఉన్నారు. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు, దీనిపై ఏమైనా డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇంట్లో దీనిపై పెద్దగా చర్చించుకోవడం లేదని చెప్పింది. అనంతరం అదే టైంలో ఆమె తండ్రి నాగబాబు హట్‌ అయ్యారని, అందుకే ఆ ట్వీట్‌ పెట్టారు.

ఇంట్లో ఏం మాట్లాడుతున్నారని అడగ్గా.. "ఇంట్లో ఎవరూ దీనిపై పెద్దగా మాట్లాడటం లేదు. మా నాన్న ట్వీట్‌ ఎందుకు పెట్టారో తెలియదు. ఆయన ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడు ఏదోక పోస్ట్‌ పెడుతూనే ఉంటారు. ఆయన వాట్సాప్‌లో కూడా ఎప్పుడు ఏదోక సుత్తి పెడుతూనే ఉంటారు. ఇక ఆ ట్వీట్‌ ఎందుకు పెట్టారో, ఏ ఉద్దేశంతో పెట్టారనేది నాకు తెలియదు. అయితే వాళ్లంతా ఏం అంటారంటే ఎవరికి నిర్ణయాలు వారికి ఉంటాయి. వాళ్లు ఏం చేయాలనుకున్నా వాళ్ళకంటూ కొన్ని కారణాలుంటాయి. ఇలా చేశారు కాబట్టి అందరూ కలిసి ఉండాలని లేదు. రాజకీయ పరంగా, మతపరంగా, ఆత్మీయపరంగా అయినా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే వారు చేస్తారు" అని చెప్పుకొచ్చింది. దీంతో  పరోక్షంగా అల్లు అర్జున్‌ తనకు నచ్చింది చేశాడంటూ ఆమె స్పష్టం చేసిదంటున్నారు. ప్రస్తుతం నిహారిక కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

Also Read: చిరంజీవి వైరల్ వీడియోపై సందేహాలు - అక్కడ జరిగింది వేరు, చూపించింది వేరా?

Continues below advertisement