PV Sindhu Calls Having ‘Chiru uncle’: 2024 ఒలింపిక్స్ వేడుకలు పారిస్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ విశ్వక్రీడా సంబురాల ప్రారంభోత్సవ వేడుకలో మెగా ఫ్యామిలీ పాల్గొన్నది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ్, రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన, వారి కూతురు క్లింకార కూడా వెళ్లారు. గత కొద్ది రోజులుగా పారిస్ వీధుల్లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓవైపు ఒలింపిక్స్ వేడుకలు తిలకిస్తూనే, మరోవైను పర్యాటక ప్రదేశాలు చూస్తూ హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. పారిస్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.


సింధు మ్యాచ్ చూసిన మెగా ఫ్యామిలీ


అటు ఈ ఒలింపిక్స్ లో ఎలాగైనా మెడల్ సాధించాలనే లక్ష్యంతో పీవీ సింధు బరిలోకి దిగింది. పారిస్ లో ఉన్న సింధును మెగా ఫ్యామిలీ కలిసింది. సింధును ఎంకరేజ్ చేసింది. చిరంజీవి ప్రత్యేకంగా ఆమెను అభినందించారు. కచ్చితంగా విజయం సాధించాలని ప్రోత్సహించారు. అంతేకాదు, సింధు తొలి మ్యాచ్ ను మెగా ఫ్యామిలీ మెంబర్స్ తిలకించారు. దగ్గరుండి ఉత్సాహపరిచారు. సింధును కలిసిన ఫోటోలను, తొలి మ్యాచ్ చూస్తున్న పిక్స్ ను అభిమానులతో పంచుకుంది ఉపాసన.  


‘చిరు అంకుల్’ అంటూ సింధు పోస్టు


అటు పీవీ సింధు సైతం మెగా స్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. చిరు అంకుల్ తో పాటు ఆయన కుటుంబం అంతా వచ్చి తన మ్యాచ్ చూడటం సర్ ప్రైజ్ గా ఉందని వెల్లడించింది. “చిరు అంకుల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా వచ్చి నా మ్యాచ్ చూడటం నిజంగా నాకు సర్ ప్రైజింగ్ గా ఉంది. క్లీంకారతో కలిసి రావడం మరింత హ్యాపీగా ఉంది. చిరంజీవి అంకుల్ లా చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే చిరంజీవి అంకుల్ ను ఇండస్ట్రీ బాగా గౌరవిస్తుంది. సురేఖ, ఉపాసన, రామ్ చరణ్ నాకు చాలా స్పెషల్ పర్సన్స్” అని రాసుకొచ్చింది. మ్యాచ్ తర్వాత చిరు ఫ్యామిలీతో సింధు  దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో మెగాస్టార్ తో నడుస్తూ నవ్వుతూ కనిపించింది. ఇద్దరూ జాతీయ జెండాను పట్టుకుని కనిపించారు. అటు సింధు పోస్టుకు ఉపాసన రియాక్ట్ అయ్యింది. సింధు మ్యాచ్ కు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అంతకు ముందు రామ్ చరణ్, సింధు వీడియోను షేర్ చేస్తూ.. “పీవీ సింధు అక్కా.. ఇవాళ్టి మ్యాచ్ చించేశావ్. ఆల్ ది బెస్ట్” అని రాసుకొచ్చింది.






తొలి మ్యాచ్ లో విజయం సాధించిన సింధు


పారిస్ ఒలింపిక్స్  ఫస్ట్ మ్యాచ్ లో సింధు తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. గత రెండు ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన సింధు.. ఈ పోటీల్లోనూ కచ్చితంగా మెడల్ సాధించాలనే ఉత్సాహంతో ముందుకుసాగుతోంది.  


చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలు 


ఇక చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్నది. కునాల్ కపూర్  కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఇక ఆగష్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఇంద్ర’(2002) మూవీ రీరిలీజ్ కానుంది. అటు చెర్రీ.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’లో నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. 



Read Also: ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు - మను భాకర్ నయా హిస్టరీ- భారత్‌కు మరో మెడల్