Manu Bhaker Becomes 1st Athlete To Win 2 Medals In Single Edition: పారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ రెండో పతకం సాధించింది కొత్త మైలుస్టోన్ సెట్ చేశారు. ఈసారి మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించింది భారత్‌కు రెండో పతకాన్ని అందించారు. మనుతో పాటు సరబ్ జ్యోత్ సింగ్ కూడా ఈ ఈవెంట్ పాల్గొన్నారు. స్వాతంత్య్రానంతరం ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్ గా మను రికార్డు సృష్టించింది.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మున్ భాకర్, సరబ్ జ్యోత్ సింగ్ కొరియాకు చెందిన వోన్హో, ఓహ్ యే జిన్ తో తలపడి ఓడించారు. ఈ మ్యాచ్‌లో భారత జోడీ 16-10 స్కోరుతో విజయం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ ఈవెంట్‌లో కొరియా జోడీ ఓయ్ జిన్ గోల్డ్ మెడల్ సాధించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించింది మున్ భాకర్. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ ఈవెంట్‌లో మను సాధించిన పతకం పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం. సింగిల్స్ విభాగంలో జులై 28, ఆదివారం నాడు మను పతకం గెలుచుకుంది. మూడు రోజుల భారత్ లో మను రెండో పతకం సాధించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశే
2020 టోక్యో ఒలింపిక్స్‌లో మను భాకర్‌కు నిరాశే ఎదురైంది. టోక్యోలో మను పిస్టల్ ఫెయిల్ అయింది. పిస్టల్ విఫలం కావడంతో భారత మహిళా షూటర్ టోక్యో ఒలింపిక్స్‌లో పతకం రేసు నుంచి నిష్క్రమించింది. టోక్యో ఒలింపిక్స్‌లో విఫలమైన తర్వాత మను చాలా నిరాశకు గురైంది. ఒక దశలో ఆమె షూటింగ్ గేమ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. సన్నిహితుల ప్రోత్సాహంతో పట్టు వీడకుండా ప్రయత్నించి ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ రెండుసార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
గెలిచిన తర్వాత సంబరాలు
మ్యాచ్ ముగిసిన తర్వాత JioCinemaతో సరబ్‌జోత్ సింగ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇది భారత అథ్లెట్లకు కష్టతరమైన ఆట అని అంగీకరించాడు. భారతదేశ ప్రజల మద్దతు, ఆశీర్వాదాలకు మను భాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఫలితాన్ని కంట్రోల్ చేయలేకపోయినా విజయం సాధించడానికి తన వంతు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని అన్నారామె.
మను భాకర్ సాధించిన రికార్డులు:-
1. 2004 ఏథెన్స్‌లో సుమా షిరూర్ తర్వాత ఒలింపిక్ షూటింగ్ ఫైనల్‌లోకి ప్రవేశించిన 20 ఏళ్లలో మొదటి భారతీయ మహిళ
2. ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్
3. ఎయిర్ పిస్టల్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయురాలు.
4. ఒలింపిక్ గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి ఇండియన్.
5. రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ షూటర్
6. ఒలింపిక్స్‌లో టీమ్ మెడల్ సాధించిన మొదటి భారతీయ షూటింగ్ పెయిర్ (మను భాకర్ & సరబ్జోత్ సింగ్).
7. వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయురాలు.