Ranbir Kapoor About Father Rishi Kapoor: ఇప్పటికే చాలామంది నెపో కిడ్స్ బాలీవుడ్‌లో స్టార్ హీరోహీరోయిన్లుగా వెలిగిపోతున్నారు. అందులో హ్యాండ్‌సమ్ హీరో రణబీర్ కపూర్ కూడా ఒకడు. సీనియర్ నటుడు రిషీ కపూర్ వారసుడిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు రణబీర్. కానీ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన తండ్రి పెద్ద స్టార్ హీరో అయినా కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారని రిషీ కపూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రితో తన అనుబంధం ఎలా ఉండేదో బయటపెట్టాడు. న్యూయార్క్‌కు వెళ్లి యాక్టింగ్ కోర్స్ చేసొచ్చిన రణబీర్.. రిషీ కపూర్‌కు తగిన వారసుడు అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. కపూర్ ఫ్యామిలీలో టాప్ స్టార్‌గా ఎదిగాడు.


న్యూయార్క్‌లో ట్రైనింగ్..


ముందుగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్లాక్’ అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు రణబీర్ కపూర్. అలా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో తన తొలి అడుగు పడింది. ఆ తర్వాత భన్నాలీ దర్శకత్వంలోనే ‘సావరియా’ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా 2007లో విడుదలయ్యింది. ఇక హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టక ముందు కొన్నాళ్ల పాటు న్యూయార్క్‌లో జీవితాన్ని గడిపాడు రణబీర్. ముంబాయ్‌లో కాలేజ్ చదువులు పూర్తయిన తర్వాత న్యూయార్క్‌లోని ది స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఆ సమయంలో తన తండ్రి బడ్జెట్ విషయంలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో గుర్తుచేసుకున్నాడు.


రెండుసార్లు భోజనం కష్టమే..


విజువల్ ఆర్ట్స్ పూర్తయిన తర్వాత మెథడ్ యాక్టింగ్ నేర్చుకోవడం కోసం మళ్లీ న్యూయార్క్‌లోనే లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో రణబీర్‌ను చేర్చారట రిషీ కపూర్. ఆ సమయంలో తన తండ్రి కనీసం రోజుకు రెండుసార్లు భోజనం చేయడానికి కూడా డబ్బులు ఇచ్చేవారు కాదని గుర్తుచేసుకున్నాడు రణబీర్ కపూర్. ‘‘అప్పటికే నేను ఇండియా వచ్చేసి పనిమొదలుపెట్టాలి అనే ఆలోచనలో ఉన్నాను. నాకు అమెరికాలో సరిపడా ఎక్స్‌పీరియన్స్ దొరికింది అనుకున్నాను. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన మనుషులతో మాట్లాడడం, ఒంటరిగా జీవించడం నాకు చాలా నేర్పించాయి. అప్పుడు నాన్న బడ్జెట్ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. లంచ్‌కు 2 డాలర్లు, డిన్నర్‌కు 2 డాలర్లు ఇచ్చేవారు’’ అని తెలిపాడు.


బస్‌లో వెళ్లాను..


‘‘నాతో మా నాన్న ఎప్పుడూ చెప్పలేదు కానీ ఆయన నేను ఎప్పుడూ ఒక సూపర్ స్టార్ కొడుకులాగా కాకుండా స్టూడెంట్‌గానే జీవించాలని కోరుకునేవారు. జీవితం అంటే ఏంటి, ఎన్నో కష్టాలు ఉంటాయని నేను నేర్చుకోవాలని అనుకున్నారు. ముంబాయ్‌కు తిరిగొచ్చిన తర్వాత నాకు పాకెట్ మనీ ఇవ్వడం మానేశారు. సంజయ్ లీలా భన్సాలీకి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు నేను బస్‌లో వెళ్లేవాడిని’’ అని గుర్తుచేసుకున్నాడు రణబీర్ కపూర్. ఇక కాలేజీ రోజుల్లో తనకు సిగరెట్స్ తాగే అలవాటు ఉండేదని, రాహా కపూర్ పుట్టిన తర్వాత తన ఆరోగ్యాన్ని దృ‌ష్టిలో పెట్టుకొని స్మోకింగ్ మానేశానని తెలిపాడు. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’తో రణబీర్ బిజీగా ఉన్నాడు.



Also Read: బాత్రూమ్ వీడియో లీక్‌పై స్పందించిన ఊర్వశి రౌతెలా - అంటే.. ఇందులో ఆమె ప్రమేయం లేదా?