Urvashi Rautela About Her Leaked Bathroom Video: టెక్నాలజీ అనేది పెరుగుతున్నకొద్దీ సినీ సెలబ్రిటీలకు దీని వల్ల కలుగుతున్న ఇబ్బందులు కూడా పెరిగిపోతున్నాయి. ఎప్పుడూ అందరి ఫోకస్‌లో ఉండే వారికి.. ప్రైవసీ అనేది లేకుండా పోతోంది. తాజాగా ఊర్వశి రౌతెలా కూడా ఈ టెక్నాలజీకి బలయ్యింది. ఇటీవల తన బాత్రూమ్ వీడియో లీక్ అయ్యింది. కొన్ని గంటల్లోనే అది సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు.. దీని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొందరు ఇది కావాలని లీక్ చేసిన వీడియో అని కూడా అన్నారు. ఇక నెటిజన్ల కామెంట్స్‌కు ఊర్వశి రౌతెలా తాజాగా స్పందించింది.


ఆ వీడియో కాదు..


ఈ రోజుల్లో పబ్లిసిటీ కోసం, సినిమా ప్రమోషన్స్ కోసం నటీనటులు ఏదేదో చేస్తున్నారు. ఇక ఊర్వశి రౌతెలా బాత్రూమ్ వీడియో కూడా అలాంటి ఒక పబ్లిసిటీ స్టంట్ అని చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఊర్వశి స్పందించకపోవడం కూడా అనేక అనుమానాలకు దారితీసింది. కావాలేనే ఆ వీడియో లీక్ చేసి ఉంటారని సందేహించారు. ఇక ఫైనల్‌గా సైలెన్స్‌ను బ్రేక్ చేస్తూ ఈ విషయంపై రియాక్ట్ అయ్యింది ఈ భామ. ‘‘ఈ వీడియో బయటికి వచ్చినప్పటి నుండి నేను చాలా బాధలో ఉన్నాను. ఇది నా ‘ఘుస్పైఠియా’ సినిమాలోని సీన్. నా నిజ జీవితంలో జరిగింది కాదు. అది నిజంగా స్నానం చేస్తున్నప్పుడు తీసిన వీడియో కాదు’’ అని క్లారిటీ ఇచ్చింది ఊర్వశి రౌతెలా.






అలా అస్సలు జరగకూడదు..


ఇక ఊర్వశి రౌతెలా లీక్ వీడియో అంటూ వైరల్ అయిన ఈ క్లిప్ వల్ల తన అప్‌కమింగ్ మూవీ ‘ఘుస్పైఠియా’కు బాగానే ప్రమోషన్స్ జరిగాయి. ఆగస్ట్ 9న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. సోషల్ మీడియా వల్ల, ఇంటర్నెట్ వల్ల ప్రజలు ఎదుర్కునే ఇబ్బందులు ఏంటి అనేది ఈ సినిమాలో చూపించినట్టుగా తెలుస్తోంది.‘ఘుస్పైఠియా’లో ఊర్వశితో పాటు అక్షయ్ ఒబ్రాయ్, వినీత్ కుమార్ సింగ్.. ఇందులో లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక ఈ బాత్రూమ్ వీడియో గురించి ఊర్వశి రౌతెలా మాట్లాడుతూ.. ‘‘ఏ అమ్మాయికి ఇలా ఎప్పటికీ జరగకూడదు’’ అని అభిప్రాయం వ్యక్తం చేసింది. మొత్తానికి తన సినిమా కోసం ఊర్వశి రౌతెలా చేసిన ఈ ప్రమోషన్ సూపర్ హిట్ అయ్యిందని నెటిజన్లు అంటున్నారు.







Also Read: ఆకట్టుకుంటున్న విశ్వక్‌ సేన్‌ మెకానిక్‌ రాకీ గ్లింప్స్‌  - ఎల్‌కు సరికొత్త అర్థం చెప్పిన హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్