Mechanic Rocky First Glimpse Out: 'మాస్‌ కా దాస్‌', యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా  ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా 'మెకానిక్ రాకీ'(Mechanic Rocky Movie). కొత్త దర్శకుడు  రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వేల్యూస్, హ్యుజ్ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 


సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సాగినా ఈ గ్లింప్స్‌ బాగా ఆకట్టుకుంటుంది. యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్ మూవీ బాగా ఆకట్టుకోబోతుందని అనిస్తుంది. టీజర్‌ సునీల్ లుక్‌ ఆసక్తిని పెంచుతుంది. ఈ గ్లింప్స్‌లో చూపించిన యాక్షన్‌ ఎపిసోడ్‌, హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్‌ సీన్స్‌ బాగా ఆకట్టుకుంటున్నాయి. మధ్యలో విశ్వక్‌ సేన్‌ చేత హిందీలో చెప్పించని డైలాగ్‌ ఆకట్టుకుంది. ఇక డేంజర్ కి లైన్స్ వీడు అంటూ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో వస్తున్న బీజీఎమ్‌ గ్లింప్స్‌ని నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకువెళ్లిందని చెప్పోచ్చు. సునీల్‌ లుక్‌ చాలా ఇంటెన్స్‌గా ఉంది. ఒత్తైన మీసం, జుట్టుతో చాలా సీరియస్‌గా కనిపించారు. చూస్తుంటే ఆయనే ఈ సినిమాలో విలన్‌ అనిపిస్తుంది.



ఇక గ్లింప్స్‌లో చివరిలో కారుపై ఉన్న 'ఎల్‌'కు కొత్త అర్థం తీసుకువస్తూ జోక్‌ పెల్చారు. విశ్వక్‌ సేన్‌-శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ఉన్న ఈ సీన్‌ ఆకట్టుకుంది. దర్శకుడు కొత్తవాడైన ఈ సినిమా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడించి సినిమాని తీర్చిదిద్దాడని గ్లింప్స్‌ చూస్తే అర్థమైపోతుంది. మెకానిక్‌ రాకీని దిపావళి కానుగా రిలీజ్‌ చేసేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తుంది. కాగా కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్, సునీల్‌, 'వైవా' హర్ష, హర్ష వర్ధన్, 'రోడీస్' రఘు రామ్‌ వంతి తదితర నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  







Also Read: ప్రభాస్‌ 'రాజా సాబ్'‌ నుంచి సాలిడ్‌ అప్‌డేట్‌ - 'ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌'తో స్వీట్‌ ట్రీట్‌ రెడీ చేసిన మారుతి 


SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్‌ తళ్లూరి సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్‌ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  విశ్వక్‌ సేన్‌ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. మొదటి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు.  ఇటీవల గామి, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి వంటి చిత్రాలతో అలరించిన విశ్వక్‌ సేన్‌ ఇప్పుడు మెకానిక్‌ రాకీ అంటూ వస్తున్నాడు. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాపై తాజాగా విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్ ఆసక్తి పెంచుతుంది.