Premalu Actor Sangeeth Prathap Injured in Car Accident: రోడ్డు ప్రమాదంలో 'ప్రేమలు' నటుడు సంగీత్‌ ప్రతాప్‌ గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాపడినట్టు సమాచారం. అతడితో పాటు మరో మలయాళ నటుడు అర్జున్‌ ఆశోకన్‌ కూడా ఈ ప్రమాదంతో గాయడ్డారు. మలయాళ నటులైన అర్జున్‌ ఆశోకన్‌, సంగీత్‌ ప్రతాప్‌లు శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎమ్‌జీ రోడ్డుపై కారులో వెళుతున్నారు.అదే సమయంలో వారికి ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను వీరి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు, నటుడు అర్జున్‌కు స్వల్ప గాయాలు కాగా.. కారు వెనక భాగంలో కూర్చున్న సంగీత్‌ ప్రతాప్‌ మెడకు తీవ్రం గాయాలు తగడంతో ఫ్రాక్చర్‌ అయినట్టు స్థానిక మీడియాలో పేర్కొన్నారు.


దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం సంగీత్‌ ప్రతాప్‌ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారట. బైక్‌పై ఉన్న ఫుడ్‌ డెలివరీ బాయ్‌ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.మూవీ షూటింగ్‌ టైంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అర్జున్‌ అశోకన్‌, సంగీత్‌ ప్రతాప్‌ బ్రోమాన్స్‌ అనే సినిమా చేస్తున్నారట. ఈ మూవీలోని ఛేజింగ్‌ సీన్‌ చిత్రీకరించే మయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు వెనకభాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై పోలీసులు ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు నమోదు చేసి విచారణ చేపడుతన్నారు. ఈ ప్రమాదం వల్ల బ్రోమాన్స్‌ మూవీ షూటింగ్‌ తాత్కాలింగా నిలిపివేసినట్టు తెలుస్తోంది.


ప్రేమలుతో అలరించిన సంగీత్‌ ప్రతాప్‌


సంగీత్‌ ప్రతాప్‌ చివరిగా హృదయం, ప్రేమలు మూవీతో అలరించారు. ఈ సినిమాలో అతడు హీరో ఫ్రెండ్‌ పాత్రలో కనిపించాడు. తనదైన నటన, కామెడీ పంచ్‌లతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. మలయాళ భాషలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. మలయాళ సినిమా అయినా చిత్రీకరణ మొత్తం హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. దీంతో ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమాకు ఆడియన్స్‌ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక అర్జున్‌ అశోకన్‌.. ఈ ఏడాది అ‍బ్రహాం ఒజ్లర్‌, భ్రమయుగం, వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం బ్రొమాన్స్‌ సహా మరో మూడు సినిమాలు చేస్తున్నాడు. 



Also Read: ప్రభాస్‌ 'రాజా సాబ్'‌ నుంచి సాలిడ్‌ అప్‌డేట్‌ - 'ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌'తో స్వీట్‌ ట్రీట్‌ రెడీ చేసిన మారుతి