Deadpool & Wolverine Box Office Collection Day 3: వసూళ్ల సునామీ... కలెక్షన్స్ ఊచకోత... బాక్సాఫీస్ బరిలో భారీ బీభత్సం... వంటి పదాలకు అర్థం ఏమిటో వివరిస్తూ, తనకు ఎదురే లేదన్నట్టు దూసుకు వెళుతోంది 'డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్'. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, దుబాయ్ అని తేడాలు లేవు. విడుదలైన ప్రతి చోట భారీ వసూళ్లు సాధిస్తోంది. ఫస్ట్ వీకెండ్... మూడు అంటే కేవలం మూడు రోజుల్లో మూడున్నర వేల కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి సూపర్ హీరో సినిమా సత్తా ఏమిటో చాటింది.    


మూడు రోజుల్లో 3650 కోట్ల రూపాయల కలెక్షన్లు!
Deadpool & Wolverine Global Box Office: గ్లోబల్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో 'డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్' సరికొత్త చరిత్ర సృష్టించింది. జూలై 26న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. విడుదలైన ప్రతి చోట సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో థియేటర్ల దగ్గరకు ప్రేక్షకులు క్యూ కట్టారు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఊచకోత కనిపించింది. 


జూలై 26 నుంచి 28వ తేదీ వరకు... ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా 3650 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కరోనా తర్వాత సూపర్ హీరో సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇది రెండోసారి. స్పైడర్ మ్యాన్ సినిమాకు సైతం మంచి వసూళ్లు వచ్చాయి.






Also Read: బాలకృష్ణ బ్రాండ్ న్యూ అవతార్‌.. ఆహాలో 'అన్‌ స్టాపబుల్ 4 స్టార్ట్ చేసేది ఎప్పుడో తెలుసా?


'డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్'ను మార్వెల్ స్టూడియోస్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాలో డెడ్‌పూల్ పాత్రలో ర్యాన్ రెనాల్డ్స్, వోల్వరైన్ పాత్రలో హ్యూ జాక్ మెన్ నటించారు. రచన, నిర్మాణ బాధ్యతల్లో ర్యాన్ రెనాల్డ్స్ సైతం ఓ చెయ్యి వేశారు. ఈ సినిమాకు షాన్ లెవీ దర్శకత్వం వహించారు. ఏ రేటెడ్ సినిమా అయినా సరే ఈ మూవీలో కామెడీ సీన్లు, యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. దాంతో భారీ విజయాన్ని కట్టబెట్టారు.


Also Readఆహా... అప్పుడు విజయ్ దేవరకొండ, ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక!



ఇండియాలో, తెలుగులోనూ భారీ ఆదరణ
'డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్' సినిమాకు ఇండియాలో, మరీ ముఖ్యంగా తెలుగులోనూ విశేష ఆదరణ లభిస్తోంది. అమెరికన్ సూపర్ హీరోలకు ఇండియాలో ఉన్న ఆదరణకు తోడు రీజనల్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రాసిన డైలాగ్స్ విజయంలో ముఖ్య భూమిక పోషించాయి. తెలుగు వెర్షన్ డైలాగులకు సూపర్ డూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ర్యాన్ రెనాల్డ్స్ పలికిన ప్రతి డైలాగ్ పేలిందని చెప్పాలి. గ్లోబల్ బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా ఐదువేల కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Also Readహరీష్ శంకర్ vs టాలీవుడ్ మీడియా... స్టార్టింగ్ to 'మిస్టర్ బచ్చన్' వరకు - ఏం జరిగిందో తెల్సా?