Rashmika: ఆహా... విజయ్ దేవరకొండ వచ్చి వెళ్లాడు, ఇప్పుడు రష్మిక వంతు!

Telugu Indian Idol 3: అప్‌కమింగ్ సింగర్స్ టాలెంట్ వెలికి తీయడం కోసం ఆహా ప్రారంభించిన సింగింగ్ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్'. ఇప్పుడు మూడో సీజన్ నడుస్తోంది. దానికి అతిథిగా నేషనల్ క్రష్మిక వస్తోంది.

Continues below advertisement

ఆహా ఓటీటీ (AHA OTT Platform)లో స్ట్రీమింగ్ అవుతున్న 'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 3 (Telugu Indian Idol Season 3) చూస్తే ప్రేక్షకులు ఎవరైనా సరే 'ఆహా' అని అంటారంతే! సింగింగ్ అంటే ఎంతో ప్రేమ ఉన్న యంగ్ టాలెంటెడ్ తెలుగు యువతీ యువకులను ఎంకరేజ్ చేయడానికి ప్రారంభించిన రియాలిటీ షో ఇది. రెండు సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్ రన్ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ షోకి నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) వస్తోంది. 

Continues below advertisement

అప్పుడు విజయ్ దేవరకొండ... ఇప్పుడు రష్మిక!
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రారంభమైన తర్వాత ఈ రియాలిటీ షోకి వచ్చిన ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరో తెలుసా? రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' షోలో 7, 8 ఎపిసోడ్లలో విజయ్ దేవరకొండ సందడి చేశారు. అందులో ఆయన లుక్ కూడా అదిరింది. ఆ తర్వాత ఒకట్రెండు ఎపిసోడ్లలో 'ఆయ్' సినిమా టీమ్, మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల సైతం సందడి చేశారు. ఆ తర్వాత డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి వచ్చారు. విజయ్ దేవరకొండ తర్వాత ఆ స్థాయి సెలబ్రిటీ గెస్ట్ ఎవరు వస్తున్నారు? అంటే... నేషనల్ క్రష్మిక, మన రష్మికా మందన్నా అని చెప్పాలి.

అవును... ఆహా సింగింగ్ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' అప్‌కమింగ్ ఎపిసోడ్ ముఖ్య అతిథిగా రష్మికా మందన్నా వచ్చారని తెలిసింది. త్వరలో ఆమె హాజరైన ఎపిసోడ్ ప్రోమో, ఫోటోలు విడుదల చేయనున్నారని తెలిసింది. సో, అదీ సంగతి!

'యానిమల్' సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, హీరో రణబీర్ కపూర్‌తో కలిసి రష్మికా మందన్నా అటెండ్ అయిన 'అన్‌స్టాపబుల్' ఎపిసోడ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రాబోయే 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' ఎపిసోడ్ కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read: దేవర లీక్స్ షేర్ చేశారో అంతే సంగతులు - సోషల్ మీడియా అకౌంట్స్ లేచిపోతాయ్


ప్రజెంట్ రష్మిక చేస్తున్న సినిమాలు ఏమిటి?
Rashmika Mandanna Upcoming Movies: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు నేషనల్ అవార్డు తీసుకు వచ్చిన 'పుష్ప' సినిమా సీక్వెల్ 'పుష్ప 2'తో పాటు ఇంకొన్ని క్రేజీ ప్రాజెక్టులు రష్మిక చేతిలో ఉన్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు జోడీగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న 'సికందర్' సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. అది కాకుండా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్', తెలుగు - తమిళ సినిమా 'రెయిన్ బో', కోలీవుడ్ స్టార్ ధనుష్ జోడీగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న 'కుబేర'తో పాటు హిందీలో మరొక సినిమా 'చవా' చేస్తున్నారు రష్మిక.

Also Read: హరీష్ శంకర్ vs టాలీవుడ్ మీడియా... స్టార్టింగ్ to 'మిస్టర్ బచ్చన్' వరకు - ఏం జరిగిందో తెల్సా?

Continues below advertisement