Producer Dil Raju shares Behind Stories of Mr Perfect, Brindavanam : ఒక సినిమా థియేటర్ స్క్రిన్ పైన చూస్తున్నాం అంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. దాని వెనుక ఎన్నో మార్పులు, చేర్పులు ఉంటాయి. తెర వెనుక ఎంతోమంది కష్టపడతారు ఆ సినిమా ఔట్ పుట్ కోసం. నిజానికి తెర వెనుక ఏం జరుగుతుంది అనే విషయాలు చాలావరకు మనకు తెలియదు. ప్రొడ్యూసర్ల గురించైతే చెప్పక్కర్లేదు. సినిమా మొదలైనప్పటి నుంచి తెర మీదకి వచ్చే వరకు ఎన్నో ఇబ్బందులు. అలాంటి విషయాలు పంచుకున్నారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చాలా సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. తన సినిమాలకి సంబంధించి చాలా విషయాలు పంచుకున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.
'పరుగు' మూవీకి చాలా ఒత్తిడి ఎదుర్కొన్నా..
"'పరుగు' సినిమాకి చాలా ఒత్తిడి అనుభవించా. ప్రకాశ్ రాజు గారు కథ వినేసి నేచురల్ గా చేస్తాను అని షేవ్ చేసేసుకున్నారు. కొంచెం షూట్ అయ్యాక సింగిల్ షెడ్యూల్ లో చేసేస్తున్నాం కదా అని అడిగారు. అప్పుడు డైరెక్టర్, డీఓపీ అందరూ చేతులెత్తేశారు. ఏం చేయాలి అనుకున్నప్పుడు ఒక విగ్ తెచ్చి పెట్టి లుక్ ఓకేనా అన్నారు. ఇంక వెంటనే షూట్ చేశాం. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ‘పరుగు’ చాలా ఒత్తిడి మధ్య రిలీజ్ చేశాను. కానీ సినిమా హిట్ అవుతుంది అని నమ్మాను. ఫస్ట్ రోజు సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. మూడో రోజు సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది."
'బృందావనం'లో ఎన్టీఆర్‌ను అందుకే..
వంశీ.. 'మున్నా' సినిమా తర్వాత చాలా లో అయ్యాడు. అప్పుడు నువ్వు దిగులు పడకు.. డైరెక్టర్‌గా నువ్వు ఫెయిల్ అవ్వలేదు అని ధైర్యం చెప్పా. అందరూ నువ్వు బాగా తీశావు అన్నారు, పాటలు బాగున్నాయి అని కూడా అన్నారు. కానీ, మనం తప్పు చేసింది కథ దగ్గర. ఇప్పుడు అది సరి చేసుకుందాం. మళ్లీ కథ మీద దృష్టి పెట్టు అన్నాను. అప్పుడు కొరటాల శివ మున్నాకు వర్క్ చేశాడు. అతను వచ్చి 'బృందావనం' కథ చెప్పాడు. వెంటనే నేను ఎన్టీఆర్‌ను ఒప్పిస్తాను అని చెప్పాను. ఎందుకంటే.. ఎన్టీఆర్ అప్పటి వరకు సీరియస్ సినిమాలు చేశాడు. ఒక ఫ్యామిలీ సినిమా పడితే బాగుంటుంది అనిపించింది. వెళ్లి ఎన్టీఆర్‌ను కలిసి చెప్పాను. వినగానే భలే ఉందని అన్నాడు. ఆ తర్వాత కొడాలి నాని వీళ్లందరూ ఓకే అన్నారు. అలా సెట్ చేసి చేశాం. తారక్ కూడా కొత్త లుక్ లో కనిపించాడు. అందరూ ముందు ట్రోల్ చేశారు. కానీ, తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వాళ్ల ఇంట్లో వాళ్లకి వారం రోజుల ముందే సినిమా వేశాం. వాళ్లంతా చూసి చాలా చాలా హ్యాపీ. అప్పుడే తారక్ వాళ్ల గృహప్రవేశం. కొత్త ఇంట్లోకి వెళ్తున్నావు. 'బృందావనం' బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని చెప్పాను. అలానే జరిగింది."
ఐదు రోజులు షూట్ చేసి రకుల్ ని వద్దన్నాను..
"'మిస్టర్ పర్ఫెక్ట్' కథ అనుకున్నప్పుడు ప్రభాస్ మలేషియాలో 'బిల్లా' షూటింగ్ లో ఉన్నాడు. వెళ్లి అక్కడ కథ చెప్పాం. అప్పుడు సెకండ్ హాఫ్ మీద డౌట్ ఉంది అన్నాడు ప్రభాస్. సరే షూటింగ్ అయ్యాక వచ్చాక విను. మార్పులు చేస్తాం అని చెప్పాను. ఇండియా వచ్చిన ప్రభాస్.. నా ఆఫీస్‌కు వచ్చాడు. నిజానికి కథకు నో చెప్పడానికి వచ్చాడు. కానీ, మొత్తం విని బయటికి వచ్చి గట్టిగా పట్టుకుని, నో చెప్దాం అని వచ్చాను. కానీ, నువ్వు నన్ను లాక్ చేశావు. ఏం మ్యాజిక్ చేశావు అన్న అని అన్నాడు. ఇక ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా అనుకున్నాం. ఐదు రోజులు షూట్ చేశాం. రష్ చూసేసరికి మాకు ఎవ్వరికీ నచ్చలేదు. అస్సలు సంతృప్తిగా లేము. సినిమా అంతా అమ్మాయి మీద ఉంది. ఎమోషన్స్ పండివ్వాలి. సెకెండ్ హాఫ్‌లో చాలా సన్నగా ఉంది రకుల్. వర్కౌట్ అవ్వదు అనిపించింది. ఐదు రోజులు అయ్యాక షూట్ ఆపేసి వద్దని చెప్పాం. ప్రభాస్ కి చెప్పాం. ఎవరైనా స్ట్రాంగ్ హీరోయిన్ కావాలి అన్నాను. వెంటనే కాజల్ అని అన్నారు. అయితే, ఇప్పటికే ‘డార్లింగ్’ చేస్తున్నాను అన్నాడు. అయితేనేం అని చెప్పి.. కాజల్ ని అడిగితే ఓకే చెప్పింది. అలా రకుల్ ప్లేస్ లో కాజల్ వచ్చింది. ఫస్ట్ టైం అలా చేయడం.. చాలా బాధ అనిపించింది. కానీ, సినిమా కంటే ఏదీ ముఖ్యం కాదు నాకు" అని తన అనుభవాలను పంచుకున్నారు దిల్ రాజు.
Also Read: బాలకృష్ణ బ్రాండ్ న్యూ అవతార్‌తో 'అన్‌స్టాపబుల్ 4' - స్టార్ట్ చేసేది ఎప్పుడో తెలుసా?