నితిన్ కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో తెలుగమ్మాయి అంజలి ప్రత్యేకమైన పాటలో నటించిన విషయం తెలిసిందే.  'రా.. రా.. రెడ్డి.. నేను రెడీ' అంటూ ఊరమాస్ పాటలో అంజలి, నితిన్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ పాటలో నితిన్ తొలి చిత్రం జయంలో రాను రానంటున్న చిన్నదో.. పాట లిరిక్స్ రీమిక్స్ చేశారు. నితిన్, అంజలి పోటా పోటీగా ఈ పాటకు స్టెప్పులు వేశారు. ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. మనల్నే కాదండోయ్ విదేశీయులని సైతం ఈ పాట ఆకట్టుకుంది. కొందరు విదేశీయులు ఈ పాటకి నితిన్, అంజలి వేసిన స్టెప్పులని వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'ఫారినర్స్ కూడా మన నితిన్ అన్న సాంగ్ కి డాన్స్ వేశారు అంటే ఈ పాట థియేటర్లలో దుమ్మురేపుతుంది' అని వీడియో కింద రాసుకొచ్చారు. 


రాజకీయ కథా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ గా కనిపించనున్నారు. 'మాచర్ల నియోజకవర్గం' సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ తో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు 'భీష్మ', 'మాస్ట్రో' చేశారు. ఇప్పుడీ 'రా రా రెడ్డి... మాస్ జాతర రెడీ' పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యంగా అందించగా... లిప్సిక ఆలపించారు. ఇందులో నితిన్ జోడీగా యువ హీరోయిన్ కృతి శెట్టి నటించారు. కేథరిన్ థ్రెసా మరో హీరోయిన్. 'మాచర్ల నియోజకవర్గం' ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి (ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్) ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్‌ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


Also Read: కారులో, బోటులో సెక్స్ చేశా - విజయ్ దేవరకొండ


అంజలికి ఇది రెండో ఐటం సాంగ్. గతంలో అల్లు అర్జున్ తో కలిసి 'సరైనోడు' సినిమాలో ఆడి పాడింది. ఇప్పుడు మరో సారి ప్రత్యేక గీతంలో నటించింది. నితిన్ నటించిన 'జయం' సినిమాలోని 'రాను రానంటున్న.. సిన్నదో.. ' పాట అప్పుడు బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు మరో సారి మళ్ళీ ఆ పాట దుమ్మురేపుతోంది. 


Also Read: విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?