మీరు చదివిన హెడ్డింగ్ నిజమే... అందులో ఎటువంటి తప్పు లేదు! యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఓపెన్‌గా చెప్పిన విషయమే! అదీ ప్రముఖ హిందీ దర్శక - నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోలో! అసలు విషయంలోకి వెళితే... 


''ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్‌లో చేశావా?'' అని ఒక ప్రశ్నకు సమాధానంగా... ''అవును'' అన్నట్టు విజయ్ దేవరకొండ టిక్ చేశారు. ఎక్కడ? అని కరణ్ జోహార్‌కు సందేహం వచ్చింది. ''బాత్ రూమ్ (లూ)లోనా?'' అని అడిగితే... ''కాదు, బోటులో'' సమాధానం ఇచ్చారు. ''ఇతర పబ్లిక్ ప్లేస్‌ల‌లో...'' అని కరణ్ జోహార్ మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు విజయ్ దేవరకొండ ''కారులో కూడా! ఆశపడిన సందర్భాల్లో'' అని చెప్పారు.


ముగ్గురితో శృంగారం చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని విజయ్ దేవరకొండ చెప్పిన ప్రోమో వైరల్ అయ్యింది. 'లైగర్'లో తన సరసన కథానాయికగా నటించిన అనన్యా పాండేతో కలిసి 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7లో ఆయన సందడి చేశారు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. అందులో విజయ్ దేవరకొండ సెక్స్ గురించి మాట్లాడిన మాటలు మరింత వైరల్ అవుతున్నాయి.


Also Read : తిరుపతిని సర్వనాశనం చేశారు - వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై అశ్వనీదత్ విమర్శలు


సెలబ్రిటీల సెక్సువల్ లైఫ్ గురించి ప్రశ్నలు అడగడానికి ఏమాత్రం మొహమాట పడని టాక్ షో హోస్ట్ ఎవరైనా ఉన్నారంటే కరణ్ జోహార్ అని చెప్పాలి. షోలో తన ముందు కూర్చున్న గెస్టులతో సెన్సేషనల్ టాపిక్స్ మాట్లాడించడం ఆయన స్టైల్. లేటెస్ట్ సీజన్‌లో ఇప్పటి వరకు విడుదలైన ఎపిసోడ్స్ చూస్తే... విజయ్ దేవరకొండ ఎపిసోడ్ టాప్ ప్లేస్ లో ఉంటుందని చెప్పవచ్చు.


Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?