Producer Ashwini Dutt Shocking Comments On YS Jagan Mohan Reddy Government and TTD : ''ఇప్పుడు తిరుపతిలో జరగని పాపం లేదు. ఈ ప్రభుత్వం (వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం) వచ్చిన తర్వాత... ఈ మూడేళ్ళలో తిరుపతిని స్వరనాశనం చేశారు. (ఏడు కొండల వెంకటేశ్వర) స్వామి ఎందుకు అలా చూస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు'' అని నిర్మాత సి. అశ్వినీదత్ అన్నారు.


దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన సినిమా 'సీతా రామం'. ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో అశ్వినీదత్ ముచ్చటించారు. అప్పుడు రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చింది.


రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కోసం ప్రచారం చేస్తానని అశ్వినీదత్ తెలిపారు. తనకు చంద్రబాబు అంటే అభిమానం అని చెప్పారు. అటువంటి నాయకుడు మళ్ళీ రాలేదన్నారు. తిరుమలలోని వెయ్యి కాళ్ళ మండపం తొలగించినప్పుడు చంద్రబాబుపై చిన్న జీయర్ స్వామి విమర్శలు చేశారని, ఆయన ఇప్పుడేం చేస్తున్నారని అశ్వినీదత్ ప్రశ్నించారు.
 
''వెయ్యి కాళ్ళ మండపం తీసేసిన తర్వాత ప్రతి వారం ప్రెస్‌మీట్స్‌లో చంద్రబాబును చిన్న జీయర్ స్వామి తిట్టారు. ఆ గుడి తీయడానికి కారణం ఏంటంటే... ఈవోలు, కొంత మంది ఆచార్యులు కలిసి శాస్త్రం ప్రకారం లేదని చెప్పడంతో చంద్రబాబు సరేనన్నారు. అప్పుడు విమర్శలు చేశారు. ఇప్పుడు ఏ రోజు అయినా మాట్లాడారా? విశాఖలో ఉన్న స్వామి మరీ దారుణం. నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి... హిమాలయాల్లో కళ్లజోడు పెట్టుకుని 150 కిలోమీటర్ల స్పీడులో చిన్న జీయర్ స్వామి కారు డ్రైవ్ చేస్తున్నారు. ఇట్లాంటి స్వాములా మనకు చెప్పేది?'' అని అశ్వనీదత్ ప్రశ్నించారు.


Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?


పల్లెల్లో చాలా మత మార్పిళ్లు జరుగుతున్నాయని అశ్వనీదత్ అన్నారు. వాటిపై చిన్న జీయర్ స్వామి ఒక్క రోజు మాట్లాడలేదు. పైగా, జగన్ దైవాంశ సంభూతుడు అని చెప్పారు. సమ్మక్క సారక్క మీద విమర్శలు చేశారు. ఆ తర్వాత తాను అలా అనలేదన్నారు. ప్రస్తుత జగన్ ప్రభుత్వ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 


Also Read : ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' కోసం రెండు విడుదల తేదీలు