యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ (Deepika Padukone) జంటగా నటిస్తున్న సినిమా 'ప్రాజెక్ట్ కె' (Project K Movie). 'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'సీతా రామం' సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత అశ్వినీదత్... 'ప్రాజెక్ట్ కె' విడుదల ఎప్పుడో చెప్పారు.


Project K Release Date : వచ్చే ఏడాది జనవరిలో 'ప్రాజెక్ట్ కె' చిత్రీకరణ పూర్తి అవుతుందని సి. అశ్వినీదత్ చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కొంత టైమ్ పడుతుందని... అక్టోబర్ 18, 2023న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయలేని పక్షంలో 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నట్లు అశ్వినీదత్ తెలిపారు.


Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెరపై రానటువంటి కథాంశంతో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కుతోందని టాక్. 


Also Read : 'పేపర్ రాకెట్' - ముఖ్యమంత్రి కోడలి దర్శకత్వంలో