'పేపర్ రాకెట్' (Paper Rocket)... కొన్ని గంటల్లో 'జీ 5' ఓటీటీలో విడుదల కానున్న ఒరిజినల్ సిరీస్. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది. అక్కినేని నాగార్జున తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే... ముఖ్యమంత్రి కోడలు దర్శకత్వం వహించిన సిరీస్ ఇది.


'పేపర్ రాకెట్' వెబ్ సిరీస్ దర్శకురాలు కృతిగ ఉదయనిధి (Kiruthiga Udhayanidhi) ఎవరో కాదు... తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ (MK Stalin) కోడలు. తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో ఉదయనిధి స్టాలిన్ భార్య.


కృతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ 'పేపర్ రాకెట్'. దీని కంటే ముందు రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే... ఈ సిరీస్‌తో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.


Also Read : షూటింగ్‌లో హీరోయిన్‌కు గాయమైంది - కొన్ని రోజులు బెడ్ రెస్ట్






'పేపర్ రాకెట్' ఒక ఫీల్ గుడ్ సిరీస్ అని 'జీ 5' ప్రతినిధులు చెబుతున్నారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే... సమస్యలతో సతమతం అవుతున్న కొందరు కలిసి ట్రిప్ వేయడం, ఆ టూర్‌లో జరిగిన సంఘటనల సమాహారమే కథగా తెలుస్తోంది. ఇందులో కాళిదాస్ జయరామ్, తాన్యా రవిచంద్రన్, కె రేణుక, కరుణాకరన్, గౌరీ జి. కిషన్ తదితరులు నటించారు.


Also  Read : వాళ్ళ హార్ట్ బ్రేక్ చేయడం ఇష్టం లేదు - పెళ్లి గురించి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ