హీరోయిన్ సంయుక్తా హెగ్డే (Samyuktha Hegde) గుర్తు ఉన్నారా? నిఖిల్ సిద్దార్థ్ 'కిరాక్ పార్టీ'లో నటించారు. తర్వాత కన్నడ - తెలుగు బైలింగ్వల్ 'కాలేజ్ కుమార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల 'ఆహా'లో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా 'మన్మథ లీలై'లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకంటే... ఆమెకు గాయం అయ్యింది.


ప్రస్తుతం సంయుక్తా హెగ్డే 'క్రీమ్' (Kreem Movie) అని యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఫైట్ సీన్ తీస్తుండగా... ఆమెకు గాయం అయ్యింది. సరిగా ల్యాండ్ కాకపోవడంతో మోకాలి దగ్గర బలమైన గాయమైందని సంయుక్తా హెగ్డే చెప్పారు. కొన్ని రోజులు ఆమెకు బెడ్ రెస్ట్ తప్పదని తెలుస్తోంది.


Also Read : శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదిరిస్తే మరణం - అంచనాల సరిహద్దులు చెరిపేస్తూ 'బింబిసార' రిలీజ్ ట్రైలర్


ఎలా గాయమైంది? అనేది ప్రేక్షకులకు చూపించడం కోసం సంయుక్తా హెగ్డే మేకింగ్ వీడియో విడుదల చేశారు. తనకు గాయమైనప్పటికీ... సినిమా విడుదలైన తర్వాత ఆ ఫైట్ చూశాక ప్రేక్షకులు అందరూ అప్రిషియేట్ చేస్తారని ఆమె చెబుతున్నారు. అదీ సంగతి!


Also  Read : వాళ్ళ హార్ట్ బ్రేక్ చేయడం ఇష్టం లేదు - పెళ్లి గురించి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ