టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన మరో కుర్ర హీరో కిరణ అబ్బవరం. గతంలో రాజావారు రాణి గారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం వంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. గతంలోనే మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను మూవీ మేకర్స్ విడుదల చేసారు. హీరోయిన్ వెనుక హీరో వెంటపడుతున్నట్టు ఉంది ఫస్ట్ గ్లింప్స్. దాన్ని చూస్తుంటే ఇది మంచి లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. ఈ సినిమాలో కిరణ్ కు జోడీగా తెలుగమ్మాయి చాందిని చౌదరి నటిస్తోంది. 


ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. మిగతా 20 శాతం పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది గోపీనాథ్ రెడ్డి. యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రవీణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. 


ఇక హీరోయిన్ చాందిని చౌదరి విశాఖపట్నానికి చెందిన అమ్మాయి. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో చాలా చిన్న పాత్ర చేసింది. ఆ తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్ గా మారింది. కలర్ ఫోటో సినిమా ఆమెకు మంచిపేరు తీసుకొచ్చింది. 



Also read: కొరియన్ అమ్మాయిలు సన్నగా, మెరుపుతీగల్లా ఎలా ఉంటారు?


Also read: అతిగా తాగుతున్నారా... ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ డామేజ్ అయినట్టే


Also read: బిస్కెట్లు, కేకులు అధికంగా తింటే... ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం, తేల్చిన కొత్త అధ్యయనం


Also read: గోళ్లకు వచ్చే అరుదైన క్యాన్సర్... చెక్ చేసుకోవడం ఇలా


Also read: ఎట్టకేలకు డెంగూ జ్వరానికి ఔషధం... కనిపెట్టిన లక్నో శాస్త్రవేత్తలు


Also read:  గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి