వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటిస్తోన్న సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలే ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. వీరితో పాటు కొన్ని పాత్రలను యాడ్ చేశారు. అందులో సునీల్, సోనాల్ చౌహన్ లాంటి స్టార్లు ఉన్నారు. ఈ సినిమాను మే 27న విడుదల చేయనున్నారు.
దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో విడుదలవుతోన్న అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. మల్టీప్లెక్స్ లో 150 రూపాయల టికెట్ ను 200 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. సింగిల్ థియేటర్లో 50 నుంచి 75 రూపాయలు ఉండే టికెట్స్ ను 150 వరకు అమ్ముతున్నారు.
'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి మొన్న విడుదలైన 'సర్కారు వారి పాట' వరకు ఇదే తంతు. దీంతో 'ఎఫ్3' సినిమా టికెట్ రేట్లు కూడా పెంచుతారేమో అనుకున్నారు. కానీ అలా చేయడం లేదని నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లకే టికెట్స్ ను అమ్ముతామని.. ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు. టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Also Read: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?
Also Read: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్