బిగ్ బాస్ నాన్ స్టాప్ షో పన్నెండు వారాలుగా సాగుతోంది. ఈ వారంతో ఓటీటీ వెర్షన్ కి ముగియనుంది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ తరువాత హౌస్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. మిత్రాశర్మ, అనిల్ రాథోడ్, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవి ఈ ఏడుగురు టైటిల్ కోసం పోటీపడుతున్నారు. నిజానికి ప్రతి సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉండేవారు. ఈసారి మాత్రం ఏడుగురు ఉన్నారు.
మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు కానీ అలా జరగడం లేదు. బుధవారం రాత్రి వరకు మాత్రమే ఓటింగ్ లైన్స్ ఉన్నాయి. హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ కి ఓట్లు పడుతున్నాయి గనుక వీరంతా ఫైనలిస్ట్ లనే చెప్పాలి. ఇక ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ఎపిసోడ్ ను శనివారం నాడు చిత్రీకరించనున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి.
ఇప్పటివరకు జరిగిన పోలింగ్ ప్రకారం.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారు..? విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందో తెలుసుకుందాం. అందరికంటే తక్కువ ఓట్లు అనిల్ రాథోడ్ కి పోల్ అయ్యాయి. ఆ తరువాత మిత్రాశర్మ లిస్ట్ లో ఉంది. టాప్ 5 విషయానికొస్తే.. బాబా భాస్కర్ ఐదో స్థానంలో.. అరియనా గ్లోరీ నాల్గో స్థానంలో ఉంది. యాంకర్ శివ మూడో స్థానాల్లో ఉన్నారు. టైటిల్ కోసం బిందు మాధవి, అఖిల్ సార్థక్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.
ఓటింగ్ ప్రకారం.. బిందు మాధవి.. అఖిల్ కంటే ముందు స్థానంలో ఉంది. కొన్ని అన్ అఫీషియల్ పోల్స్ మాత్రం అఖిల్ ముందున్నారు. అయితే ఇద్దరి మధ్య తేడా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఓవరాల్ గా ఇప్పటివరకు పోల్ అవుతున్న ట్రెండ్ ను చూస్తే.. బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ రేస్ లో బిందు మాధవికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఈ జోరు కొనసాగితే మాత్రం ఆమె టైటిల్ విన్నర్ అవ్వడం ఖాయం. కానీ ఓటింగ్ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేం!
Also Watch: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!