మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స్టయిలిష్ యాక్షన్ ఫిలిమ్స్ తీయడంలో ప్రవీణ్ సత్తారు తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే నెక్స్ట్ లెవల్ అన్నట్టు ఈ సినిమా ఉంటుందట. వచ్చే నెల లండన్ లో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... ఈ సినిమాలో విలన్ గా తమిళ్ హీరోని కన్ఫర్మ్ చేశారు. 


తమిళ హీరో వినయ్ రాయ్ గుర్తు ఉన్నారా? ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన 'వాన'లో నటించారు. ఆ తర్వాత తెలుగు కంటే తమిళంలో ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. విశాల్ 'డిటెక్టివ్', శివ కార్తికేయన్ 'డాక్టర్' సినిమాలతో విలన్ అయ్యారు. ఆ రెండు సినిమాల్లో ఆయన చూపించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాలు చూసి వరుణ్ తేజ్ సినిమాలో విలన్ పాత్రకు వినయ్ రాయ్ ను ప్రవీణ్ సత్తారు సంప్రదించారట. కథ, అందులో తన క్యారెక్టర్ విన్న వెంటనే వినయ్ రాయ్ కూడా ఓకే చెప్పారని తెలిసింది. 


Also Read: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై


వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమా షూటింగ్ అంతా యూరోప్ లో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లండన్ షెడ్యూల్ లో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. మిగతా 20 శాతం కూడా యూరోప్ దేశాల్లో చేస్తారట. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్.


Also Read: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి