యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin). వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా 'ప్రాజెక్ట్ కె' (Project K Movie). వర్కింగ్ టైటిల్ అని చెప్పినప్పటికీ... ఆడియన్స్, యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ లోకి ఆ టైటిల్ బాగా వెళ్ళింది. 


'ప్రాజెక్ట్ కె' ఎంత వరకు వచ్చింది? అప్ డేట్స్ ఏంటి? అనేది తెలుసుకోవడం కోసం ప్రభాస్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు ఒక ప్రభాస్ అభిమానికి, దర్శకుడు నాగ్ అశ్విన్ కి మధ్య ట్విట్టర్ లో ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. అదేంటంటే... 


ప్రభాస్ పుట్టిన రోజున 'ప్రాజెక్ట్ కె' సినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ చూశారు. అయితే, రాలేదు. అప్పుడు నాగ్ అశ్విన్ ని అడిగితే... 'రాధే శ్యామ్' విడుదల తర్వాతే'' అని చెప్పారు. ఇప్పుడు ఆ ట్వీట్ కోట్ చేస్తూ... ''అన్నా! గుర్తు ఉన్నామా?'' అని ప్రభాస్ అభిమాని అడిగారు. 


''గుర్తు ఉన్నారు. ఇప్పుడే ఒక షెడ్యూల్ అయ్యింది. ప్రభాస్ గారి ఇంట్రో బిట్ తో సహా! ఆయన చాలా కూల్ గా ఉన్నారు. జూన్ నెలాఖరు నుంచి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. రిలీజ్ ఆర్డర్ లో మనం లాస్ట్ కదా! వరుసగా అప్ డేట్స్ ఇవ్వడానికి టైమ్ ఉంది. అందరు ప్రాణం పెట్టి పని చేస్తున్నాం'' అని ప్రభాస్ అభిమానికి నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చారు.


Also Read: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి
 





'ప్రాజెక్ట్ కె'లో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. మరో బాలీవుడ్ బ్యూటీ, వరుణ్ తేజ్ 'లోఫర్' ఫేమ్ దిశా పటానీ సైతం సినిమాలో నటిస్తున్న తెలిపారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. 


Also Read: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'