Vijay Devarakonda and Samantha's Kushi Movie Update: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. రీసెంట్‌గా టైటిల్ వెల్లడించారు. పవన్ కల్యాణ్ క్లాసిక్ హిట్ 'ఖుషి' టైటిల్‌తో సినిమా వస్తోంది. ఇదీ ప్రేమకథా చిత్రమే. అయితే, కశ్మీర్ నేపథ్యంలో రూపొందుతోన్న ప్రేమకథా సినిమా. ఇందులో ఎవరి పాత్రలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...


'ఖుషి' సినిమాలో కశ్మీర్ యువతి పాత్రలో సమంత కనిపించనున్నారని గతంలో వినిపించింది. టైటిల్ వెల్లడించడంతో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూస్తే... కశ్మీర్ యువతిగా అనిపించడం లేదు. నుదుట & మెడలో బంగారు ఆభరణాలు, అడ్డంగా పెట్టుకున్న విభూతి, దాని కింద చిన్న కుంకుమ బొట్టు... సమంత లుక్ చూస్తే ఈజీగా ఆమె తమిళ అమ్మాయి ఆహార్యంలో కనిపించారని చెప్పవచ్చు. మరోవైపు విజయ్ దేవరకొండ నోటిలో సిగరెట్ పెట్టుకుని ఉన్నారు. ఆయన డ్రస్సింగ్ స్టయిల్ కశ్మీర్ యువకుడిలా ఉంది. ప్రస్తుతానికి వాళ్ళిద్దరి క్యారెక్టర్లు అవే అనుకోవాలి.


ఫస్ట్ లుక్‌లో హీరో హీరోయిన్ల క్యారెక్టర్లు రివీల్ చేయకుండా... ప్రేక్షకులకు స‌ర్‌ప్రైజ్‌ ఇవ్వాలని దర్శకుడు శివ నిర్వాణ ఇలా డిఫరెంట్, ఆపోజిట్ గా ప్లాన్ చేశారా? లేదంటే... ఒరిజినల్ క్యారెక్టర్స్ అవేనా అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.


మోషన్ పోస్టర్ లో మాంగల్యం తంతునామేనా మంత్రాలతో పాటు 'ఖుషి... నువ్ కనపడితే! ఖుషి... నీ మాట వినపడితే! ఖుషి... నా ఒళ్ళంతా తుళ్ళింతే!' అంటూ వినపడిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. 


ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నారు.


Also Read: లక్ష్మీ మంచు - నిద్ర లేచింది మహిళా లోకం


మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి. 


Also Read: రోజాను సన్మానించిన జబర్దస్త్ టీం - పాత, కొత్త ఆర్టిస్టులతో సందడి!