సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకుపోతుంది. ఇక ఈరోజు కర్నూలులో సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. దీనికి మహేష్ బాబుతో సహా టీమ్ మొత్తం హాజరైంది. ఒక్కొక్కరూ చాలా జోష్ తో స్పీచ్ లు ఇచ్చారు. 


ఇక స్టేజ్ పై డాన్సర్స్ 'మ మ మహేషా' సాంగ్ కి డాన్స్ చేస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వారితో కలిసి స్టెప్పులేసే ప్రయత్నం చేశారు. ఆ తరువాత సడెన్ గా మహేష్ బాబు కూడా స్టేజ్ పైకి వెళ్లారు. తన మాస్ స్టెప్స్ తో ఫ్యాన్స్ ను అలరించారు. మహేష్ స్టేజ్ ఎక్కి ఇలా డాన్స్ చేయడం తొలిసారి. ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఎప్పుడూ ఇలా చేయలేదు. 


దీంతో ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. కర్నూలులో ఈవెంట్ జరగడం గురించి మాట్లాడిన మహేష్.. ఇంతమంది వస్తారనుకోలేదని.. అందుకే ఫస్ట్ టైం స్టేజ్ మీదకు వచ్చి డాన్స్ చేశానని అన్నారు. ఇది సక్సెస్ మీట్ కంటే వంద రోజుల ఫంక్షన్ లా ఉందని అన్నారు. ఆ తరువాత యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 


సినిమా చూసిన తరువాత తన పిల్లలు గౌతమ్, సితారల రియాక్షన్ ఏంటని మహేష్ ని అడగ్గా.. గౌతమ్ షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడని చెప్పారు మహేష్. తన కూతురు సితార.. 'చాలా బాగా చేశావ్ నాన్న.. అందంగా ఉన్నావ్' అని చెప్పిందట. 'సర్కారు వారి పాట' సినిమా తనకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్ అని.. సినిమాలో లవ్ ట్రాక్ తన ఫేవరెట్ అని చెప్పారు. ఇక ఈ సినిమా చూసిన తరువాత సూపర్ స్టార్ కృష్ణ 'పోకిరి, దూకుడు కంటే పెద్ద హిట్ అవుతుందని' చెప్పినట్లు మహేష్ గుర్తు చేసుకున్నారు.  


Also Read: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!


Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!