Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు దర్శకుడు ఒక కండిషన్ పెట్టారని టాక్. ఇంతకీ, ఆ కండిషన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కు దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కండిషన్ పెట్టారా? వీలైనంత త్వరగా 'సలార్' షూటింగ్ స్టార్ట్ చేయడానికి వెయిట్ తగ్గమని చెప్పారా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో టాక్. ప్రస్తుతం ప్రభాస్ వెయిట్ తగ్గే పనిలో ఉన్నారని సమాచారం.

Continues below advertisement

ప్రభాస్ లుక్స్, వెయిట్ విషయంలో కొన్ని రోజులుగా విమర్శలు వినిపిస్తున్నాయి. 'సాహో' విడుదల అయిన తర్వాత ప్రభాస్‌లో మునుపటి అందం కనిపించలేదని చాలా మంది కామెంట్ చేశారు. 'రాధే శ్యామ్'లో హ్యాండ్సమ్‌గా కనిపించినా... కొన్ని విమర్శలు అయితే వచ్చాయి.

'రాధే శ్యామ్' విడుదల తర్వాత ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల స్పెయిన్‌లో ఆయన మోకాలికి సర్జరీ జరిగింది. అందువల్ల, కొంత వెయిట్ పెరిగారు. వెయిట్ పెరగడానికి ముందు 'సలార్' షూటింగ్ కొంత జరిగింది. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మునుపటి షేప్‌లోకి రావాలని ప్రశాంత్ నీల్ కోరారట. ప్రస్తుతం ప్రభాస్ వెయిట్ తగ్గే పనిలో బిజీగా ఉన్నారట.

Also Read: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

'సలార్' షూటింగ్ 30- 35 శాతం కంప్లీట్ అయ్యింది. త్వరలో లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఇయర్ ఎండ్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ లో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

Also Read: లక్ష్మీ మంచు - నిద్ర లేచింది మహిళా లోకం

Continues below advertisement