కన్నడ వినోద పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. టీవీ నటి చేతనా రాజ్ (Chethana Raj) మృతి చెందారు. కాస్మొటిక్ సర్జరీ ఆమె ప్రాణాలు బలి తీసుకుని ప్రాథమిక సమాచారం అందుతోంది. అసలు వివరాల్లోకి వెళితే...
కన్నడ టీవీ ప్రేక్షకులకు చేతనా రాజ్ సుపరిచితురాలు. ఆమె పలు టీవీ షోస్, సీరియల్స్ చేశారు. బెంగళూరులోని డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌లో సోమవారం (మే 16న) ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఫ్యాట్ ఫ్రీ కోసం చేతనా రాజ్ కాస్మొటిక్ సర్జరీని అశ్రయించినట్టు తెలుస్తోంది. అయితే... సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో బాగా ఇబ్బంది పడ్డారట.
డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌లో ఐసీయూ లేకపోవడంతో హుటాహుటిన మంజునాథ్ నగర్ లోని కడే హాస్పిటల్‌కు తరలించారు. తమ ఆస్పత్రికి వచ్చేసరికి చేతనా రాజ్ మరణించినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. అంతే కాదు... చేతనా రాజ్‌ను తీసుకొచ్చిన వైద్యుడు ఒకరు తమ వైద్యులను బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
మరోవైపు... సోమవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చేతనా రాజ్ ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలుస్తోంది. స్నేహితులతో కలిసి ఆమె ఆస్పత్రికి వెళ్లిందట. తమ కుమార్తె మరణానికి కాస్మొటిక్ సర్జరీ చేసిన డాక్టర్ నిర్లక్ష్యమే కారణం అని చేతనా రాజ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా 21 ఏళ్లకు చేతనా రాజ్ మరణించడం పట్ల పలువురు సంతాపం (RIP Chethana Raj) వ్యక్తం చేస్తున్నారు.
చేతనా రాజ్ మృతి పట్ల ఒక నెటిజన్ భిన్నంగా స్పందించారు. ''భగవంతుడు చేతనా రాజ్ కు అందమైన శరీరం ఇచ్చాడు. గ్లామరస్ గా ఉండటం కోసం ఎందుకు దానిని చేంజ్ చేసుకోవడం! తనను తాను చంపుకోవడం? ప్రకృతితో ఎప్పుడూ ఆటలు ఆడవద్దు'' అని ఒకరు ట్వీట్ చేశారు.
Also Read: లక్ష్మీ మంచు - నిద్ర లేచింది మహిళా లోకం