ఇంటి నుంచి వెళ్లిపోతున్న  హిమను ఉండేలా మాట్లాడుతుంది సౌందర్య. హాలిడేస్‌లోనైనా వస్తావా రావా అని ప్రశ్నిస్తుంది. నిశ్చితార్థం క్యాన్సిల్‌ అయిన విషయాన్ని మనసులో పెట్టుకొని దెప్పి పొడుస్తుంది. వాటికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోతుంది హిమ. మేమంతా బోర్‌ కొడుతున్నామని.. మంచిగా సంపాదిస్తున్నప్పుడు మా అవసరం ఏముంటుందిలే అంటుంది. వెళ్లే ముందు పెళ్లి ఎందుకు వద్దన్నావో చెప్పి వెళ్లమని రిక్వస్ట్ చేస్తుంది. కారణం చెప్పి వెళ్లమంటుంది. పెళ్లి సెట్ చేస్తే ఆనందపడిన నువ్వు ఎందుకు వద్దన్నావో చెప్పకుండా వెళ్లిపోతే ఎలా వదిలేస్తామంటూ క్లాస్ తీసుకుంటుంది. ఏమీ అడగకుండా ఎలా ఉంటామని క్వశ్ఛన్ చేస్తుంది. సమాధానం ఉన్నప్పటికీ మాకు చెప్పడం లేదని అంటుంది సౌందర్య. సమాధానం చెప్పిన తర్వాత ఇంటి గడప దాటాలంటోంది. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని... నా నుంచి తప్పించుకోవడానికే ఇంటి నుంచి వెళ్లిపోతున్నావని అభిప్రాయపడుతుంది సౌందర్య. ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు సమాధానం చెప్పమని ఆర్డర్ వేస్తుంది సౌందర్య. ఆ మాటకు సౌందర్యను గట్టిగా హిమ కౌగిలించుకుంటుంది. 


తన ఇంట్లో ఆనందంతో డ్యాన్స్ చేస్తుంది జ్వాల. ఆమె ఆనందం చూసి పిన్ని బాబాయ్‌ చాలా సంతోష పడతారు. ఆనందంగా ఉన్నానని... ఇవాళ పార్టీ ఇస్తానని చెబుతుంది జ్వాల. అలా ఖర్చు పెట్టడం కంటే.. ఇంటిలోనే వండుకుందామని సలహా ఇస్తారు పిన్నీబాబాయ్. వాళ్లకు డబ్బులు ఇచ్చి బయటకు వెళ్లిపోతుంది జ్వాల. 


డైనింగ్ టేబుల్‌పై కూర్చొని నిశ్చితార్థం గురించే ఆలోచిస్తుంటాడు నిరుపమ్‌. అతనికి వడ్డిస్తున్న స్వప్న... క్లాస్ తీసుకుంటుంది. హిమ వద్దన్నా ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నిస్తుంది స్వప్న. అదే జీవితమని తాగుతూ బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేనంటుంది. దాన్నే తలుచుకొని బాధపడటం ఏం బాగాలేదంటుంది. ఆ నష్టజాతకురాలు ఇంటికి రాకపోవడం మంచిదే అంటుంది. దాన్ని మరిచిపోమంటుంది. రాత్రుళ్లు అలా అసహ్యంగా అలాంటి వాళ్లతో రావద్దని సజెస్ట్ చేస్తుంది స్వప్న. అమ్మ అలా మాట్లాడుతుంటే... తిన్నది ఆపేసి కడిగి వెళ్లిపోతాడు. ఏమని అడిగితే కడుపు నిండిపోయిందని సమాధానం చెప్తాడు. 


ఆటోలో వెళ్తున్న జ్వాల.. తన గురించి ఇంట్లో వాళ్లు ఏమనుకుంటున్నారో అనుకుటుంది. ఎలాగైనా నన్నమ్మ నెంబర్‌ కనుక్కొని విషయాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. అసలు నన్ను వెతుకుతున్నారో లేదో అనే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆటో ఆపి.. నిరుపమ్‌ కోసం ఆలోచిస్తుంది. నాకు నిరుపమ్ ఉన్నాడని... లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనుకుటుంది. ఇంతలో రాత్రి వదిలేసిన కారు గుర్తుకు వచ్చి అక్కడి వెళ్తుంది జ్వాల. 


అక్కడ ఒంటరిగా నిల్చొని నిశ్చితార్థం గురించి ఆలోచిస్తుంటాడు నిరుపమ్. ఇంతలో జ్వాల అక్కడికి వస్తుంది. రాత్రి ఏమైందని ప్రశ్నిస్తుంది జ్వాల. ఏమైనా ఎక్కువ మాట్లాడానా అని క్వశ్చన్ చేస్తాడు నిరుపమ్. కారు కోసం ఆలోచించి ఇక్కడకు వచ్చావా థాంక్స్ అంటాడు.. 


రేపటి ఎపిసోడ్ 
ఆసుపత్రిలో ఉన్న నిరుపమ్‌ను కలిసేందుకు హిమ వస్తుంది. బావా అని పిలుస్తుంది. చెప్పండి డాక్టర్ హిమ అని రిప్లై ఇస్తాడు నిరుపమ్. నాతో మాట్లాడమని రిక్వస్ట్ చేస్తుంది. ఏదో ఫైల్ చూస్తుంటే అది లాగేస్తుంది. అందులో హిమ ఫొటోలు ఉంటాయి. హిమ మాట్లాడుతుండగానే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు నిరుపమ్.   
మరోవైపు జ్వాలను ఇంటి నుంచి లాక్కెళుతుంది సౌందర్య. కారులో ఎక్కడికో తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగితే నోరుమూసుకొని కూర్చోమని కసురుకుంటుంది.