నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంతమంది నటులను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి తారలు ఉన్నారు. ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. అలానే సెకండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇందులో 'ఖిలాడి' బ్యూటీ డింపుల్ హయతి.. బాలయ్యతో కలిసి స్టెప్పులు వేయనున్నారని ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదు. ఈ ఐటెం సాంగ్ కోసం చంద్రికా రవి అనే మోడల్ ను రంగంలోకి దింపారు. 


ఈమె తెలుగులో 'చీకటి గదిలో చితకొట్టుడు' అనే సినిమాలో నటించారు. ఇప్పుడు బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నారు. ఇప్పుడు బాలయ్య, చంద్రికలపై సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్మించిన సెట్ లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను చిత్రబృందం షేర్ చేసింది. ఇందులో బాలయ్య, గోపీచంద్ మలినేని, శేఖర్ మాస్టర్, తమన్ కనిపిస్తున్నారు. ఈ సాంగ్ ఆడియన్స్ కు మాసివ్ ట్రీట్ అవుతుందని చెబుతున్నారు మేకర్స్. 


Also Watch: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!


Also Read: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ