2025 సంక్రాంతి బరిలోకి సందీప్ కిషన్ ‘మజాకా’ అనే సినిమాతో దిగనున్నాడు. బాలీవుడ్ సినిమా ‘లాపతా లేడీస్’ భారతదేశం నుంచి ఆస్కార్స్‌కు అధికారిక ఎంట్రీగా నిలిచింది. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ శ్రేయాస్ మీడియా ప్రెస్ నోట్ ద్వారా క్షమాపణలు చెప్పింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షూటింగ్‌లు ప్రారంభించారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ విజయవాడలో ప్రారంభం అయింది. దర్శకుడు శంకర్ ‘దేవర’, ‘కంగువా’ సినిమాలకు వార్నింగ్ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.


సంక్రాంతి బరిలోకి సందీప్ కిషన్ 'మజాకా'
2025 సంక్రాంతి బరిలోకి సందీప్ కిషన్ తన కొత్త సినిమాతో అడుగు పెట్టబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్ మార్క్ 30వ సినిమా 'మజాకా'. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా సినిమా ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది అనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో సందీప్ కిషన్ నిజమైన సంక్రాంతి వైబ్ క్రియేట్ చేశారు. సాంప్రదాయ పంచ కట్టులో షేడ్స్ ధరించి, భుజంపై టేప్ రికార్డర్ తో పెద్ద కూర్చిపై కూర్చుని కనిపించిన సందీప్ కిషన్ అప్పుడే పండగ వాతావరణాన్ని కళ్ళ ముందు కనిపించేలా చేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఆస్కార్స్‌కు 'లాపతా లేడీస్'
లాపతా లేడీస్... ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ సినిమా పేరు మార్మోగుతోంది. ఎందుకు? అంటే... ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి అధికారికంగా ఓ సినిమాను పంపుతుంది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఆస్కార్ 2025కు 'లాపతా లేడీస్'ను పంపుతున్నట్టు ప్రకటించింది. ఈ సినిమాతో పాటు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ', రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' సినిమాలను కాదని మరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


35 వేల మంది వచ్చారు...
మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22వ తేదీన జరగాల్సి ఉంది. కానీ ఫ్యాన్స్ ఊహించని సంఖ్యలో వేదిక వద్దకు రావడంతో ఈవెంట్‌ను క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవెంట్ మేనేజ్‌‌మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియాపై విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఏం జరిగిందనే విషయం గురించి ఈ సంస్థ అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


వీరమల్లు సెట్స్‌లో అడుగుపెట్టిన పవన్...
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా తన విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతూ... మరోవైపు ప్రతిపక్షాల వల్ల ఏర్పడిన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నారు. అలాగే మధ్యలో వీలు చూసుకుని సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభించారు. హరిహర వీరమల్లు సెట్స్‌లో ఆయన అడుగు పెట్టారు. విడుదల తేదీని కూడా వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


దర్శకుడు శంకర్ సీరియస్ వార్నింగ్ ఆ రెండు సినిమాలకేనా?
ప్రముఖ తమిళ డైరెక్టర్ శంకర్ పలువురు సినీ మేకర్స్ వ్యహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నవయుగ నాయగన్‌ వేళ్‌ పారి’ నవలలోని పలు సన్నివేశాలను కాపీ కొట్టి సినిమాల్లో పెట్టేశారని ఆరోపించారు. కాపీ రైట్స్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)