Director Shankar Deeply Upset: ప్రముఖ తమిళ డైరెక్టర్ శంకర్ పలువురు సినీ మేకర్స్ వ్యహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నవయుగ నాయగన్‌ వేళ్‌ పారి’ నవలలోని పలు సన్నివేశాలను కాపీ కొట్టి సినిమాల్లో పెట్టేశారని ఆరోపించారు. కాపీ రైట్స్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


క్రియేటర్ల హక్కులను గౌరవించండి


ప్రముఖ తమిళ రచయిత వెంకటేషన్ ‘నవయుగ నాయగన్‌ వేళ్‌ పారి’ అనే నవలను రాశారు. ఆ నవల తనకు ఎంతగానో నచ్చడంలో దర్శకుడు శంకర్ ఆ బుక్ రైట్స్ కొనుగోలు చేశారు. ఆ కథను ఉపయోగించి ప్రతిష్టాత్మకంగా ఓ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వచ్చిన కొన్ని సినిమాల్లో ఆ పుస్తకంలోని పలు కీలక సన్నివేశాలను కాపీ కొట్టి తెరకెక్కించినట్లు తెలుసుకుని దర్శకుడు శంకర్ ఆశ్చర్యపోయారు. క్రియేటర్ల హక్కులను గౌరవించకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని  హెచ్చరించారు.


దర్శకుడు శంకర్ ఏమన్నారంటే..  


“అటెన్షన్ టు ఆల్.. ప్రముఖ రచయిత వెంకటేషన్ రాసిన ఐకానిక్ తమిళ నవల ‘వీర యుగ నాయగన్ వేల్ పారీ’ కాపీ రైట్స్ హోల్డర్ గా.. ఈ పుస్తకంలోని కీలక సన్నివేశాలను చాలా సినిమాల్లో పర్మిషన్ లేకుండా ఉపయోగించడం చూసి షాక్ అయ్యాను. ఇటీవలి సినిమా ట్రైలర్‌ లో నవలలోని ముఖ్యమైన సన్నివేశాలు ఉండటం ఆశ్చర్యం కలిగించింది. దయచేసి నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు మరేదైనా మాధ్యమంలో ఉపయోగించడం మానుకోండి. క్రియేటర్స్ హక్కులను గౌరవించండి. అనధికారికండా కాపీ చేయడం మానుకోండి. కాపీ రైట్స్ హక్కలును ఉల్లంఘించకండి. లేదంటే చట్టపరమైన చర్యలు సిద్ధంగా ఉండండి” అంటూ దర్శకుడు శంకర్ హెచ్చరించారు. అయితే, ఆయన ఏ సినిమా గురించి అన్నారు అనేది మాత్రం ప్రత్యేకంగా చెప్పలేదు.






శంకర్ చెప్పింది ‘దేవర’ గురించా? ‘కంగువా’ గురించా?


తాజాగా వచ్చిన సినిమా ట్రైలర్లు అంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘దేవర’, సూర్య నటించిన ‘కంగువా’ చిత్రాలకు సంబంధించినవే. ఈ రెండు సినిమాల్లో సముద్రం నేపథ్యంలో సాగే ఎక్కువ సన్నివేశాలు ‘దేవర’లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శంకర్ మాట్లాడింది ‘దేవర’ గురించే అనే చర్చ జరుగుతోంది. అటు ‘కంగువా’లోనూ కొన్ని సముద్ర సన్నివేశాలు ఉన్నాయి. మొత్తంగా శంకర్ కామెంట్స్ ఈ రెండు సినిమాలను ఉద్దేశించే అనే టాక్ వినిపిస్తోంది.     


‘గేమ్ ఛేంజర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్న శంకర్  


దర్శకుడు శంకర్ రీసెంట్ గా ‘భారతీయుడు 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో కలిసి ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పొలిటికల్‌ యాక్షన్‌ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్‌, అంజలి, నవీన్‌ చంద్ర, ఎస్‌ జె సూర్య ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.  


Also Read: బ్రేకింగ్ న్యూస్... 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ - మెయిన్ రీజన్స్ ఇవే